భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో శనివారం భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 28,591 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 338 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాగా.. కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 20,487 కరోనా కేసులు నమోదు కాగా.. 181 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతానికి పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,32,36,921 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,42,655 చేరింది. నిన్న కరోనా నుంచి 34,848 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,24,09,345 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,32,36,921 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
India reports 28,591 new #COVID19 cases, 34,848 recoveries, and 338 deaths in last 24 hours, as per Health Ministry.
Total cases: 3,32,36,921
Active cases: 3,84,921
Total recoveries: 3,24,09,345
Death toll: 4,42,655Total vaccination: 73,82,07,378 (72,86,883 in last 24 hours) pic.twitter.com/6JoT6wJkPC
— ANI (@ANI) September 12, 2021
ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 72,86,883 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 73,82,07,378 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 69,833 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 296 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 6,61,302కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 3,893కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 322 మంది కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,52,085కు చేరుకుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.60 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.
మరోవైపు, పలు జిల్లాల్లోని పాఠశాలల్లో కరోనా వైరస్ విజృంభిస్తూ కలవర పెడుతుంది. వివిధ జిల్లాల్లోని స్కూల్స్ లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ వైరస్ వ్యాప్తితో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎలాంటి భయమూ వద్దని ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నా కరోనా తన పని తాను చేసుకుని పోతుంది. శనివారం రోజు నల్గొండ జిల్లాలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్‌లో కరోనా కలకలం రేపింది. హైస్కూల్ ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ సహా మరో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రిన్సిపాల్ జార్జ్ జోసఫ్ చికిత్సపొందుతూ మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది.
ఇవి కూడా చదవండి: Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..