కాశీవిశ్వనాథా..! నీకూ తప్పలేదా.. ? కరోనా హైరానా…!

|

Mar 10, 2020 | 11:30 AM

కొవిడ్- 19 మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భూతం బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కొల్పోయారు. ఇంకా వేలల్లోనే భాదితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ వైరస్ కారణంగా దేవుడు కూడా భయపడిపోతున్నాడు. దెబ్బకు ముఖానికి మాస్క్ వేసుకున్నాడు...

కాశీవిశ్వనాథా..! నీకూ తప్పలేదా.. ? కరోనా హైరానా...!
Follow us on

కొవిడ్- 19 మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భూతం బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కొల్పోయారు. ఇంకా వేలల్లోనే భాదితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈ వైరస్ కారణంగా దేవుడు కూడా భయపడిపోతున్నాడు. దెబ్బకు ముఖానికి మాస్క్ వేసుకున్నాడు…అదేంటి…దేవుడికి వైరస్ సోకడం..అనుకుంటున్నారా…?అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే…

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల విశ్వనాథ్‌ ఆలయంలో విచిత్రం చోటు చేసుకుంది. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు దేవుని విగ్రహానికి మాస్క్‌లు పెట్టారు ఓ పూజారి. అంతేకాదు భగవంతుని విగ్రహాన్ని భక్తులు ఎవరూ తాకరాదని విజ్ఞప్తి చేశారు. దీంతో అక్కడకు వచ్చిన భక్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేంటని పూజారిని ప్రశ్నించగా..ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆలయంలోని విగ్రహానికి మాస్క్‌ కట్టినట్లు పూజరి వివరించారు.

చేతులలో విగ్రహాన్ని తాకడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, భక్తులు స్వామివారిని చేతితో తాకితే.. కరోనావైరస్‌ ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంది. కావున కొద్ది రోజుల వరకు భక్తులు విగ్రహాన్ని తాకరాదు’ అని పూజరి విజ్ఞప్తి చేశారు. దాంతో పాటుగానే వైరస్‌ గురించి అక్కడికి వచ్చే భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, కొందరు భక్తులు మాస్క్ వేసుకున్న విగ్రహాలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.