Sonia Gandhi: ఇది పరివర్తన ఉద్యమం.. భారత్‌ జోడో యాత్రపై లేఖ రాసిన సోనియా గాంధీ

అనారోగ్యం కారణాల వల్ల ఈ కార్యక్రమంలో తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లుగా వెల్లడించారు. ఇందుకు తాను చింతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కానీ, తన ఆలోచనలన్నీ యాత్ర వెంటే నడుస్తుంటాయి..

Sonia Gandhi: ఇది పరివర్తన ఉద్యమం.. భారత్‌ జోడో యాత్రపై లేఖ రాసిన సోనియా గాంధీ
Sonia Gandi

Updated on: Sep 07, 2022 | 10:23 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించన ‘భారత్ జోడో యాత్ర’పై ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ లేఖ రాశారు. కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను దేశరాజకీయాల్లో ఒక పరివర్తన ఉద్యమం. చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్‌కు ఇది ఎంతో ప్రత్యేకమైన సందర్భం అని పేర్కొన్నారు. ఈ యాత్రలో దారిపొడవునా పాల్గొనబోతున్న నేతలకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ప్రత్యేకించి.. 3,600 కిలోమీటర్ల పాదయాత్రలో పూర్తిగా పాల్గొననున్న 120 మంది సభ్యులను అభినందిస్తున్నట్లుగా వెల్లడించారు.

అనారోగ్యం కారణాల వల్ల ఈ కార్యక్రమంలో తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నట్లుగా వెల్లడించారు. ఇందుకు తాను చింతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. కానీ, తన ఆలోచనలన్నీ యాత్ర వెంటే నడుస్తుంటాయి.. నిత్యం యాత్రను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తుంటా.. కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవనం చెందుతుందని ఆశిస్తున్నాను అంటూ లేఖలో సోనియా పేర్కొన్నారు.

ఇక భారత రాజకీయాలకు ప్రతిష్టాత్మక వేదికగా అభివర్ణించే కన్యాకుమారిలోని మహాత్మా గాంధీ మండపం నుంచి బుధవారం సాయంత్రం కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర ప్రారంభమైంది. గాంధీ మండపం నుండి బీచ్ రోడ్డు వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. జోడో యాత్రలో కాంగ్రెస్‌ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారు.  కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర కశ్మీర్ లో పూర్తి కానుంది.  తమిళనాడు. కేరళ, కర్ణాటక, తెలంగాణ , మహారాష్ట్రల మీదుగా యాత్ర ముందుకు సాగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us