Congress Meet: ఇవాళ కాంగ్రెస్ కీలక భేటీ.. పార్టీ పూర్వ వైభవంపైనే ప్రధాన చర్చ!

|

Mar 26, 2022 | 11:46 AM

ఈరోజు ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో AICC ప్రధాన కార్యదర్శులు , ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్ లతో కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ పార్టీ

Congress Meet: ఇవాళ కాంగ్రెస్ కీలక భేటీ.. పార్టీ పూర్వ వైభవంపైనే ప్రధాన చర్చ!
Sonia Rahul Gandhi
Follow us on

Congress Meeting: ఈరోజు ఢిల్లీలో(Delhi) పార్టీ ప్రధాన కార్యాలయంలో AICC ప్రధాన కార్యదర్శులు , ఆయా రాష్ట్రాల ఇంఛార్జ్ లతో కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ పార్టీ(Congress Party).. ఈ సమావేశానికి వేణుగోపాల్ అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీలో అత్యంత ముఖ్యమైన అంశాలేంటంటే.. సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు డ్రైవ్ లు, ఆందోళన కార్యక్రమాల ప్రణాళికలే- ఎజెండాగా ఈ మీటింగ్ జరగనుంది.. ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న అత్యంత కీలక సమావేశం. అంతే కాదు సంస్థాగత మార్పుల గురించి ఈ మీటింగ్ లో ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశముందని అంచనా.

గ్రౌండ్ లెవల్ వరకూ పార్టీలో సమూల మార్పు రావల్సి ఉందని.. ఇటీవల సోనియా గాంధీని కలిసిన G 23 నేతలు సూచించారు. అంతర్గత సంస్కరణలు అత్యంత వేగంగా తీసుకు రాకుంటే.. పరాజయ పరంపర కొనసాగుతుందని హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఓటమి తర్వాత అంతర్గత విబేధాలు తీవ్రతరమవుతున్న వేళ.. వీటిని పరిష్కరించే దిశగా అడుగేస్తున్నారు సోనియా. ఈ క్రమంలో G 23 నేతలతో మొన్న మంగళవారం ఆమె భేటీ అయ్యారు కూడా.

సంస్థాగత మార్పుల కోసం G-23 నేతలు ఒత్తిడి చేస్తుండగా, ఆగస్టు-సెప్టెంబర్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సోనియా వీరికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ స‌మూల ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది అధిష్టానం. అందులో భాగంగానే ఇవాళ్టి స‌మావేశం అత్యంత కీలకం కాబోతోంది.