వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ సీనియర్ నేత మరణించారంటున్న కాంగ్రెస్..

వైద్యుల నిర్లక్షం వల్లే గోవాకు చెందిన తమ పార్టీ సీనియర్ నేత జితేంద్ర దేశ్ ప్రభు మరణించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జితేంద్ర దేశ్ ప్రభు గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినయర్ నేత. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. అయితే గత నెలలో న్యూమోనియా తీవ్రత పెరగడంతో ప్రాణాలు కోల్పోయారు. వైద్య సహాయం అవసరమున్న సమయంలో ఆస్పత్రిలో ఇద్దరు కీలక వైద్యులు ఆస్పత్రికి రాకుండా […]

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ సీనియర్ నేత మరణించారంటున్న కాంగ్రెస్..
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 12:53 PM

వైద్యుల నిర్లక్షం వల్లే గోవాకు చెందిన తమ పార్టీ సీనియర్ నేత జితేంద్ర దేశ్ ప్రభు మరణించారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జితేంద్ర దేశ్ ప్రభు గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినయర్ నేత. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. అయితే గత నెలలో న్యూమోనియా తీవ్రత పెరగడంతో ప్రాణాలు కోల్పోయారు. వైద్య సహాయం అవసరమున్న సమయంలో ఆస్పత్రిలో ఇద్దరు కీలక వైద్యులు ఆస్పత్రికి రాకుండా నిర్లక్ష్యం వహించారని.. వచ్చి వైద్య సహాయం అందిస్తే.. ఖచ్చితంగా ప్రాణాలు దక్కేవని కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షుడు గిరీష్ చొడంకర్ అన్నారు. తమ నేత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు.

కాగా.. ఈ ఘటనపై సీనియర్ రెసిడెంట్‌ వైద్యుడితో పాటుగా.. గోవా మెడికల్‌ కాలేజీ మరియు ఆసుపత్రి డీన్‌ను సస్పెండ్‌ చేశారు. అంతేకాదు.. రేడియాలజీ విభాగం ఇంఛార్జ్ డాక్టర్‌ జీవన్‌ వెర్నేకర్‌కు నోటీసులు పంపారు. అయితే.. డాక్టర్లను సస్పెండ్ చేయడంపై గోవా అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కరోనా మహమ్మారితో తాము ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతూ వైద్యం అందిస్తున్నామని.. డాక్టర్లపై అధిక భారం ఉందంటూ వాపోయారు.