నోయిడాలో భారీ ఫిల్మ్ సిటీకై యూపీ సీఎం యోగి కసరత్తు

ఇండియాలో అత్యంత అద్భుతమైన, అందమైన ఫిల్మ్ సిటీని నిర్మించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. నోయిడాలో ఇలాంటి సుందర చలన చిత్ర 'రాజ్యాన్ని' నిర్మించాలన్న యోచనలో భాగంగా ఓ కార్యాచరణ ప్రణాళికను ఆయన రూపొందించారు.

నోయిడాలో భారీ ఫిల్మ్ సిటీకై యూపీ సీఎం యోగి కసరత్తు

Edited By:

Updated on: Sep 22, 2020 | 1:21 PM

ఇండియాలో అత్యంత అద్భుతమైన, అందమైన ఫిల్మ్ సిటీని నిర్మించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. నోయిడాలో ఇలాంటి సుందర చలన చిత్ర ‘రాజ్యాన్ని’ నిర్మించాలన్న యోచనలో భాగంగా ఓ కార్యాచరణ ప్రణాళికను ఆయన రూపొందించారు. అయితే దీని రూపు రేఖలు, డిజైన్ తదితరాలపై చర్చించేందుకు ఆయన మంగళవారం బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినీ దర్శక నిర్మాతలను, నటీనటులను తన నివాసంలో సమావేశానికి ఆహ్వానించారు. వారి ప్రతిపాదనలను, సూచనలను యోగి పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఈ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించి మొదట యమునా ఎక్స్ ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ, ఆ తరువాత నోయిడా అథారిటీ ప్రభుత్వానికి  తమ ప్రతిపాదనలు పంపాయి. ఈ సిటీ నిర్మాణం కోసం 500 ఎకరాల భూమిని కేటాయించేందుకు సంబంధించిన ప్రపోజల్ ని నోయిడా అథారిటీ సమర్పించింది. బహుశా ఈ ప్రతిపాదనను యూపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించవచ్ఛునని  తెలుస్తోంది.