CISF Issues Alert At All Important Places: దేశరాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయిల్ రాయబార కార్యలయం వద్ద ఈ జరిగిన ఈ పేలుడులో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ అధికారులు అలర్ట్ అయ్యారు. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతున్న విజయ్ చౌక్‌కు కేవలం 1.5 కి.మీల దూరంలో ఈ ఘటన జరగడంతో అందరూ అప్రమత్తమయ్యారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో బాంబు దాడి జరిగిన నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీతో పాటు దేశంలోని ఎయిర్ పోర్టులు, ప్రభుత్వ భవనాల్లాంటి ముఖ్య ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. బాంబు పేలుడు ఘటనపై ఢిల్లీ సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రితో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Jammu And Kashmir: జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్… భద్రతా దళాల చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు హతం…