కరుణించిన దీదీ , 4 రోజుల్లో, మళ్ళీ సినిమా హాళ్లు ఓపెన్,

| Edited By: Pardhasaradhi Peri

Sep 27, 2020 | 12:29 PM

పశ్చిమ బెంగాల్ లో అక్టోబరు 1 నుంచి సినిమా హాళ్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు ఓపెన్ అవుతాయని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయినా గరిష్టంగా 50 మందికి మించరాదన్నారు. ఇంతే కాదు..జాతరలు, మ్యూజిక్, డాన్స్, మ్యాజికల్ షోల..

కరుణించిన దీదీ , 4 రోజుల్లో,  మళ్ళీ సినిమా హాళ్లు ఓపెన్,
Follow us on

పశ్చిమ బెంగాల్ లో అక్టోబరు 1 నుంచి సినిమా హాళ్లు, ఓపెన్ ఎయిర్ థియేటర్లు ఓపెన్ అవుతాయని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అయినా గరిష్టంగా 50 మందికి మించరాదన్నారు. ఇంతే కాదు..జాతరలు, మ్యూజిక్, డాన్స్, మ్యాజికల్ షోలను కూడా అనుమతిస్తామని ఆమె చెప్పారు. ఆరు నెలల తరువాత రాష్ట్రంలో ఇలా ఇవన్నీ అనుమతికి నోచుకోవడం విశేషం. అయితే భౌతిక దూరం పాటింపు, మాస్కుల ధారణ తప్పనిసరి, అన్ని కోవిద్ గైడ్ లైన్స్ పాటించాల్సిందే అని మమత అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 2 లక్షల 44 వేలకు పైగా నమోదు కాగా-పాతిక వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మూడు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.