గొడ్రాలు అని అన్నందుకు.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య!

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంతానం లేదనే విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీపురకు చెందిన రాజశేఖర్ (44) ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుండగా, అతని భార్య మాలాశ్రీ (35) ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భర్త మద్యం సేవించి తనను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ప్రాథమిక సమాచారం. నవంబర్ 11 రాత్రి మరోసారి గొడవ జరగడంతో భార్య కత్తితో ఛాతిలో పొడిచినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్‌ను విక్టోరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు..

గొడ్రాలు అని అన్నందుకు.. భర్తను కత్తితో నరికి చంపిన భార్య!
Wife Allegedly Stabs Husband To Death With Kitchen Knife

Updated on: Nov 13, 2026 | 6:25 AM

బెంగళూరు, నవంబర్ 13: కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. సంతానం కలగడం లేదనే విషయంపై తరచూ జరుగుతున్న గొడవలు, భర్త వేధింపులతో విసిగిపోయిన ఓ మహిళ క్షణికావేశంలో భర్తను కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన బెంగళూరులోని కెంపేగౌడ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీపురలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాజశేఖర్ (44) ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతని భార్య మాలాశ్రీ (35). ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవని తెలుస్తోంది. రాజశేఖర్ మద్యానికి బానిసై భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఆరోపణలు ఉన్నాయి. సంతానం కలగడం లేదంటూ భార్యను నిందిస్తూ దాడి చేసేవాడని సమాచారం. నవంబర్ 11వ తేదీ రాత్రి రాజశేఖర్ మద్యం సేవించి ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మరోసారి వాగ్వాదం మొదలైంది. సంతానం విషయంలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన మాలాశ్రీ వంటగదిలోని కత్తిని తీసుకుని భర్త ఛాతిలో పొడిచింది.

ఇవి కూడా చదవండి

కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనతో లక్ష్మీపుర ప్రాంతంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ తదుపరి దర్యాప్తు చేపడుతున్నారు. కుటుంబ కలహాలు, వేధింపులు చివరకు హత్యకు దారితీయడం స్థానికంగా కలకలం రేపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us