Child Marriages: వివాహ బలిపీఠంపై బాల్యం.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చైల్డ్ మ్యారేజ్‌లు

దేశ వ్యాప్తంగా ఉన్న బాల్య వివాహాల ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ సర్వే 2019-21 నివేదిక ప్రకారం 23.3% మంది బాలికలు 18 ఏళ్లలోపు, 17.7% మంది బాలురు 21 ఏళ్లలోపు వివాహం చేసుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం బాల్య వివాహాల్లో 41.6%తో పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో నిలిచింది..

Child Marriages: వివాహ బలిపీఠంపై బాల్యం.. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చైల్డ్ మ్యారేజ్‌లు
child marriages in AP and Telangana

Updated on: May 19, 2026 | 10:02 AM

అమరావతి, మే 19: ఏపీ, తెలంగాణ సహా.. దేశ వ్యాప్తంగా బాల్యవివాహాలు నానాటికీ పెరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. బాలికలు, బాలురు ఇద్దరిలోనూ బాల్య వివాహాలు పెరుగుతున్నాయని తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న బాల్య వివాహాల ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. జాతీయ సర్వే 2019-21 నివేదిక ప్రకారం 23.3% మంది బాలికలు 18 ఏళ్లలోపు, 17.7% మంది బాలురు 21 ఏళ్లలోపు వివాహం చేసుకుంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం బాల్య వివాహాల్లో 41.6%తో పశ్చిమ బెంగాల్, 40.8%తో బీహార్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (29.3%) 7వ స్థానంలో, తెలంగాణ (23.5%) 8వ స్థానంలో నిలిచాయి. జమ్మూ కాశ్మీర్ 4.5%తో చివరి స్థానంలో ఉంది.

అమ్మాయిలకు చట్టం నిర్దేశించిన కనీస వివాహ వయసు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు. అయితే దేశంలో సగటున అమ్మాయిలకు 23.3 శాతం, అబ్బాయిలకు 14.5 శాతం మంది పరిణతి వయసుకంటే ముందే వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. 21 ఏళ్ల దాటకుండా పెళ్లి చేసుకుంటున్న అబ్బాయిలు కేరళలో 1.4 శాతంగా ఉంది.

పెరుగుతున్న అబ్బాయిల ఆత్మహత్యలు..

దేశ వ్యాప్తంగా భర్తలపై కేసులు పెడుతున్న భార్యల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువగానే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 10.54 లక్షల కేసులు పురుషులపై మహిళలు పెట్టారు. ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (5 లక్షలు), రాజస్థాన్‌ (3.68 లక్షలు) ఉన్నాయి. ఏపీలో 42,233 కేసులు, తెలంగాణలో 83,911 కేసులు పురుషులపై నమోదయ్యాయి. మరోవైపు దేశ జనాభాలో పురుషుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023లో ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 12.3 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. వివిధ రకాల కారణాలతో పురుషులు 1,24,730 మంది, మహిళలు 46,648 మంది ఆత్మహత్య చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us