బీజేపీలో చేరేందుకు వెళ్లిన రౌడీ షీటర్‌.. పోలీసులను చూసి పరార్‌

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ రౌడీ షీటర్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

బీజేపీలో చేరేందుకు వెళ్లిన రౌడీ షీటర్‌.. పోలీసులను చూసి పరార్‌

Edited By:

Updated on: Sep 01, 2020 | 4:45 PM

Tamil Nadu Rowdy Sheeter: పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ రౌడీ షీటర్‌ బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో పోలీసులు అక్కడకు చేరుకోవడం వారిని చూసి పరారయ్యాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. సూర్య అనే ఓ రౌడీ షీటర్‌ మొత్తం 35 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అందులో ఆరు హత్య కేసులు కూడా ఉన్నాడు. అయితే అతడు బీజేపీలో చేరాలనుకున్నాడు. ఈ క్రమంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఎల్‌ మురగన్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు.

వారిని చూసిన వెంటనే సూర్య అక్కడి నుంచి తప్పించుకొని కారులో పరారయ్యాడు. ఇక అక్కడ సూర్య సహచరులు నలుగురు ఉండగా.. వారిని అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. మరోవైపు సూర్యపై సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో వారెంట్ లేకుండా అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురగన్ మాట్లాడుతూ.. అతడు పార్టీలో చేరాలనుకున్న విషయం తనకు తెలీదని చెప్పుకొచ్చారు.

Read More:

నివేథా కీలక నిర్ణయం.. అభినందించాల్సిందే!

ఫ్రంట్‌లైన్ వారియర్లకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఫావిలో

Follow Us