Welcome to hell: ‘నరకానికి స్వాగతం’  అంటున్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులు.. విషయం తెలిస్తే షాకవుతారు..

ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గత కొన్నాళ్ళుగా తీవ్ర రద్దీనెలకొంది. ప్రయాణికులు అన్నిరకాల చెకింగ్, పూర్తిచేసుకుని విమానం ఎక్కడానికి కొన్నిగంటల సమయం పడుతుంది... మరీ ఆదివారం అయితే..

Welcome to hell: నరకానికి స్వాగతం  అంటున్న ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులు.. విషయం తెలిస్తే షాకవుతారు..
Delhi Airport

Updated on: Dec 12, 2022 | 7:23 AM

ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గత కొన్నాళ్ళుగా తీవ్ర రద్దీనెలకొంది. ప్రయాణికులు అన్నిరకాల చెకింగ్, పూర్తిచేసుకుని విమానం ఎక్కడానికి కొన్నిగంటల సమయం పడుతుంది… మరీ ఆదివారం అయితే చాలు రద్దీతో కక్కిరిసి పోతుంది ఢిల్లీ ఎయిర్‌పోర్ట్. ఇదే మాదిరి నిన్న ఆదివారం (డిసెంబర్‌ 11) కూడా ఎయిర్‌పోర్ట్‌ రద్దీతో కిటకిటలాడింది.

ఢీల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు చాలామంది తమ అవస్థలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక ఆదివారామైతే నరకంతో పోలుస్తూ ట్వీట్ చేస్తారు. కక్కిరిసి పోయిన ఢిల్లీ లాంజ్ ఫోటోలను పంచుకుంటున్నారు. ఇలాంటి ట్వీట్‌లకు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు ట్యాగ్ చేశారు. ముఖ్యంగా మూడో టెర్మినల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రచయిత బ్రహ్మా చలానీ కుడా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పై మంత్రికి కంప్లైంట్ చేశాడు. ‘అంతర్జాతీయ ప్రయాణికుల దృష్టిలో ప్రపంచంలోనే సరిగ్గా నిర్వహించని, విసిగించే విమానాశ్రయంగా ఢీల్లీ ఎయిర్‌పోర్ట్ మారుతుంది. ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటిల వద్ద పొడవైన క్యూలు దర్శనమిస్తాయి. రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, వీఐపీ సౌకర్యాలను వాడుకొంటూ రాత్రివేళల్లో ఉండే గందరగోళం కనిపించడంలేదు’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ఈ విమానాశ్రయంలో టెర్మినల్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ లైన్లలో జాప్యం తీవ్రంగా ఉంది. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్‌ నిర్వాకులకు ఇక్కడ ఎటువంటి నియంత్రణ ఉండదు. ముఖ్యంగా ఐడీ చెక్, టికెట్ చెకింగ్ జరిగే చోట ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఢీల్లీ ఎయిర్ పోర్ట్‌లో విస్తరణ పనులు జరుగుతుండటంతో ప్రయాణికులను టీ3 వైపు మళ్ళించడం కూడ సమస్యకు కారణమవుతుంది. ప్రస్తుతం 6.6 కోట్ల వార్షిక ప్రయాణికుల సామార్థ్యం ఉన్న విమానాశ్రయాన్ని 10 కోట్లకు పెంచాలనే లక్షంతో ఈ పనులు చేస్తున్నారు. 73 శాతం పనులు ఇప్పటికే పూర్తైయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.