‘కమల్ నాథ్ పై ‘గాంధీలు’ చర్య ఎందుకు తీసుకోరు’ ? స్మృతి ఇరానీ

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2020 | 8:25 PM

బీజేపీ మహిళా నేత ఇమ్రతీ దేవి పట్ల అనుచిత వ్యాఖ్య చేసినందుకు కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ మీద ‘గాంధీలు’ ఎలాంటి చర్య తీసుకోరని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇమ్రతీ దేవిని కమల్ నాథ్ ‘ఐటమ్’ గా అభివర్ణించారు. ఈ విధమైన అంశాలు, వ్యాఖ్యలపై గాంధీ కుటుంబం మౌనంగా ఎందుకు ఉంటున్నదని ఆమె ప్రశ్నించారు. లోగడ మధ్యప్రదేశ్ కే  చెందిన దిగ్విజయ్ సింగ్ కూడా ఆయన పార్టీకే చెందిన […]

కమల్ నాథ్ పై గాంధీలు చర్య ఎందుకు తీసుకోరు ? స్మృతి ఇరానీ
Follow us on

బీజేపీ మహిళా నేత ఇమ్రతీ దేవి పట్ల అనుచిత వ్యాఖ్య చేసినందుకు కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ మీద ‘గాంధీలు’ ఎలాంటి చర్య తీసుకోరని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇమ్రతీ దేవిని కమల్ నాథ్ ‘ఐటమ్’ గా అభివర్ణించారు. ఈ విధమైన అంశాలు, వ్యాఖ్యలపై గాంధీ కుటుంబం మౌనంగా ఎందుకు ఉంటున్నదని ఆమె ప్రశ్నించారు. లోగడ మధ్యప్రదేశ్ కే  చెందిన దిగ్విజయ్ సింగ్ కూడా ఆయన పార్టీకే చెందిన మహిళా కార్యకార్యకర్తపట్ల అనుచిత వ్యాఖ్య చేశారన్నారు.

ఇదిలా ఉండగా.. ఇమ్రతీ దేవిని తను ‘ఐటమ్’ గా పేర్కొన్నందుకు చింతిస్తున్నానని కమల్ నాథ్ అన్నారు. ఎవరినీ అవమానించాలన్నది తన ఉద్దేశం కాదన్నారు. ఆమె పేరును తను మరిచిపోయానని, తన చేతిలో ఉన్న అభ్యర్థుల లిస్టులో ‘ఐటమ్ నెం. 1, ఐటమ్ నెం.2’ అని ఉన్నాయని ఆయన చెప్పారు. ఇది అవమానించినట్టా అని ప్రశ్నించారు.