ఆన్‌లైన్ షాపింగ్ సౌకర్యంతో చాలా విషయాలు సులువుగా మారాయి. అయితే, మోసాలకు సంబంధించి అనేక కేసులు పెరిగాయి. ఈ కారణంగా, ప్రభుత్వం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తోంది. మోసపూరిత లేదా డేటా దొంగిలించే ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కస్టమర్లు తమను తాము ఎలా రక్షించుకోవాలో కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘ఆన్‌లైన్ కన్స్యూమర్ రివ్యూ, ప్రిన్సిపల్ అండ్ ఫ్రేమ్‌వర్క్’కు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నోటిఫికేషన్ జారీ చేసిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు. దీని ప్రకారం, ఇ-కామర్స్‌లో నకిలీ, తప్పుదారి పట్టించే సమీక్షల నుంచి వినియోగదారులు తమ ప్రయోజనాలను రక్షించడానికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసిన ఈ నోటిఫికేషన్ అన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు వర్తిస్తుంది.
బీఐఎస్ నోటిఫికేషన్ ప్రకారం, ప్లాట్‌ఫారమ్‌లో ఎవరూ నకిలీ సమీక్షలను పోస్ట్ చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని ప్రమాణాలను పాటించడం తప్పనిసరి. ఏదైనా వేదిక ఇలా చేస్తే అప్పుడు చర్య తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ వినియోగదారులకు గోప్యత, భద్రత, పారదర్శకత, జవాబుదారీతనం మొదలైన హక్కులను అందిస్తోంది.
బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అనేక విధాలుగా ధృవీకరిస్తుంది. బీఐఎస్ ఈ ప్లాట్‌ఫారమ్ గురించి సరైన సమీక్ష జరిగిందా లేదా సమీక్ష నకిలీ పద్ధతిలో పోస్ట్ చేయబడిందా అని చెక్ చేస్తుంది. దీని కోసం ఇక్కడ అనేక మార్గాలు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..