సీబీఎస్ఈ బోర్డు 12వ తరగతి, 2021 పరీక్షలు రద్దు చేయడం లేదని, కోవిడ్ ప్రోటోకాల్‌ల మధ్య గత సంవత్సరం మాదిరిగానే జూలైలో పరీక్షలు జరుగుతాయని అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. పరీక్షలను నిర్వహించాలా వద్ద అన్న దానిపై విద్యాశాఖ ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్రం, రాష్ట్రాలు కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పరీక్షల ఫార్మాట్ గురించి, సీబీఎస్ఈ 12 తరగతి బోర్డు పరీక్ష తేదీల గురించి మరింత సమాచారం జూన్ 1 న తెలియజేయనున్నారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణపై 19 ప్రధాన అంశాలపై చర్చించారు. వీటికి చాలా రాష్ట్రాల నుంచి సానుకూల మద్దతు వచ్చింది. ఆప్షన్లపై తమ అభిప్రాయాలను రాబోయే వారంలో అందించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో పరీక్షలపై సవివరమైన ప్రకటన త్వరలో జారీ అవ్వనుంది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యాశాఖ మంత్రులతో పాటు రాష్ట్రాలకు చెందిన ఎగ్జామినేషన్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్‌తో పాటు కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణపై అనేక విషయాలను చర్చించారు.
Also Read: “ఆనందయ్యకు ప్రాణహాని ఉంది, ఆయన్ని కాపాడుకోవాల్సింది మనమే..” సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు