CBI: ఎఫ్‌సీఐ గోడౌన్లలో సీబీఐ అకస్మిక దాడులు.. అవినీతి ఆరోపణలతో రంగంలోకి దిగిన అధికారులు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌సీఐ గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేసింది. శుక్రవారం పంజాబ్‌ హర్యానా రాష్ట్రాల్లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..

  • Shaik Madarsaheb
  • Publish Date - 4:53 pm, Fri, 29 January 21
CBI: ఎఫ్‌సీఐ గోడౌన్లలో సీబీఐ అకస్మిక దాడులు.. అవినీతి ఆరోపణలతో రంగంలోకి దిగిన అధికారులు

CBI Raids FCI Godowns in Punjab, haryana: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌సీఐ గోడౌన్లపై ఆకస్మిక దాడులు చేసింది. శుక్రవారం పంజాబ్‌ హర్యానా రాష్ట్రాల్లోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కి చెందిన 50 గోడౌన్లపై సీబీఐ అధికారులు దాడి చేసి బియ్యం, గోధుమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా గోడౌన్లల్లో అక్రమాలు జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సీబీఐ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పంజాబ్‌లోని 40 గోడౌన్లల్లో తనిఖీలు చేపట్టగా.. హర్యానాలోని 10 గోడౌన్లల్లో దాడులు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

గోడౌన్లల్లో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతికి చెక్ పెట్టేందుకు పారా మిలటరీ, విజిలెన్స్ బృందాల సహాయంతో నిన్న రాత్రి నుంచి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: