Farmers Protest: సింఘు బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. రైతులపై రాళ్లు రువ్విన స్థానికులు.. పోలీసుల లాఠిఛార్జ్

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘు బోర్డర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Farmers Protest: సింఘు బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. రైతులపై రాళ్లు రువ్విన స్థానికులు.. పోలీసుల లాఠిఛార్జ్
Clashes At Farmers Protest Site Singhu Border
Follow us

|

Updated on: Jan 29, 2021 | 4:05 PM

Farmers Protest Updates – Singhu Border: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘు బోర్డర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రెండు నెలలకుపైగా రైతులు ఆ ప్రాంతంలో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్నరి ఖాళీ చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం స్థానికులు భారీగా నిరసనకు దిగారు.

ఈ క్రమంలో కొంతమంది అల్లరిమూకలు రైతుల గుడారాలపై రాళ్లు విసరడంతోపాటు గుడారాలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు వారితో ప్రతిఘటించడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు రంగలోకి దిగి రైతులను, స్థానికులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా లాఠీచార్జ్‌ చేయడంతోపాటు టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో పోలీసు అధికారితో పాటు పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇలానే గురువారం రైతులు ఈ ప్రాంతాన్ని ఖాలీ చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

Also Read:

రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డు తగిలిన ఒకే ఒక్కడు.. రైతుల చట్టాలను రద్దు చేయాలని ప్లకార్డుల ప్రదర్శన

రైతుల పోరాటానికి అన్నా హజారే మద్దతు.. ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానన్న సామాజిక కార్యకర్త