వర్షంలో బస్సుకోసం వెయిట్‌ చేస్తున్న మహిళలు.. అటుగా దూసుకొచ్చిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

కేరళలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బస్సుకోసం బస్టాండ్‌ ఎదుట వెయిట్‌ చేస్తున్న ముగ్గురు మహిళలపై ఓ బస్సు వేగంగా దూసుకొచ్చింది. అది గమనించిన మహిళలు తప్పుకుందామనుకునేలోపే ఆ బస్సు వాళ్లను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

వర్షంలో బస్సుకోసం వెయిట్‌ చేస్తున్న మహిళలు.. అటుగా దూసుకొచ్చిన బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Kerala Accident

Updated on: Jun 22, 2025 | 3:29 PM

బస్టాప్‌లో బస్సులోకం వెయిట్‌ చేస్తున్న మహిళలపైకి బస్సు దూసుకొచ్చిన ఘటన కేరళ రాష్ట్రంలో శనివారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కేరళ రాష్ట్రం త్రిసూర్ లోని చోవూర్ బస్టాండ్ లో ముగ్గురు మహిళలు బస్సు కోసం వేచి ఉన్నారు. వర్షం పడుతుండడంతో గొడుగులు పట్టుకొని నిల్చున్నారు. అయితే ఇంతలో అటు నుంచి వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బస్టాండ్‌ ఎదురుగ నిలబడి ఉన్న మహిళలపైకి దూసుకొచ్చింది.

బస్సు తమ మీదికి వస్తుండడాన్ని గమనించిన అక్కడున్న మహిళలు.. తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ అంతలోనే దూసుకొచ్చిన బస్సు ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన మహిళలను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన మొత్తం దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..