40 రూపాయ‌లు అప్పు చేసిన గొర్రెల కాపరి.. కొన్నిగంట‌ల్లోనే కోటీశ్వ‌రుడ‌య్యాడు..

|

Oct 03, 2023 | 9:12 AM

గతంలో కూడా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. కేరళలోని మలప్పురం జిల్లా పరప్పణగాడి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళ కార్మికులు 11 మంది కలిసి కొన్న లాటరీ టికెట్‌తో వారి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. రూ. 250 విలువగల లటారీ టికెట్ కొన్న 11 మంది మున్సిపాల్‌ మహిళ కార్మికులకు రూ.10 కోట్ల విలువైన లాటరీ తగిలింది.

40 రూపాయ‌లు అప్పు చేసిన గొర్రెల కాపరి..  కొన్నిగంట‌ల్లోనే కోటీశ్వ‌రుడ‌య్యాడు..
Lottery Mega Millions
Follow us on

Lottery Ticket: లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరింటి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఊహించలేం. కటిక పేదవాళ్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతుంటారు. లక్షాధికారులు కూడా కాలం కలిసి రాకపోతే,.. బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. అలాంటి ఊహించని సంఘటనతో ఒక గొర్రెల కాపరికి అనుకోని అదృష్టం వరించింది. ఒక్క దెబ్బతో అతడి దశ తిరిగిపోయింది. అప్పు చేసిన కొన్న లాటరీ అతన్ని లక్షాధికారిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్ జిల్లాలో జరిగింది ఈ అద్భుత ఘటన. ఓ కూలీ మేకలు మేపేందుకు వెళ్లాడు. కానీ మేకను మేపుకుని తిరిగొచ్చాక కోటీశ్వరుడయ్యాడు.. ఇది నిజంగా ఆశ్చర్యపోయే విషయమే..అసలు విషయం ఏంటంటే..

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్దమాన్‌లో ఓ కూలి జీవితం రాత్రి రాత్రే మారిపోయింది. మీడియా నివేదికల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్ జిల్లాలో నివసించే భాస్కర్ మాఝీ అనే కూలీని విధి వరించింది. మేకలు మేపేందుకు వెళ్లిన ఈ కూలీ పని ముగించుకుని వచ్చేసరికి లాటరీ తగిలి కోటీశ్వరుడయ్యాడు.

ఆ రైతు గత పదేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. అదేవిధంగా 40 రూపాయలు అప్పు చేసి ఆదివారం లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేశాడు.. కానీ, లాటరీ టికెట్ కొనేందుకు కూడా అతని వద్ద డబ్బులు లేకపోవడంతో తనకు తెలిసిన వారి వద్ద 40 రూపాయలు అప్పుగా తీసుకుని మమేజుల్ భాయ్ లాటరీ కౌంటర్ నుంచి 60 రూపాయలకు 95హెచ్ 83529 టికెట్ కొన్నాడు. ఆ తర్వాత యధామామూలుగా తన గొర్రెలను తోలుకుని అడవికి వెళ్లాడు..కానీ, అంతలోనే లాటరీలో మొదటి బహుమతి గెలుచుకున్న‌ట్లు తెలిసంది. దాంతో ఆ మధ్యాహ్నానికి అతడు లక్షాధికారి అయ్యాడు. ఈ వార్త విని ఆయన కూడా ఒకింత ఆశ్చర్యంతో పాటు.. సంతోషం వ్యక్తం చేశాడు. తమకు వరించిన అదృష్టంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ విషయం వారి గ్రామమంతా వ్యాపించడంతో అక్క‌డ సంబరాలు అంబ‌రాన్నంటాయి. ఆ గ్రామస్థులంతా ఆ గొర్రెలకాపరికి అభినంద‌న‌లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. కేరళలోని మలప్పురం జిల్లా పరప్పణగాడి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మహిళ కార్మికులు 11 మంది కలిసి కొన్న లాటరీ టికెట్‌తో వారి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. రూ. 250 విలువగల లటారీ టికెట్ కొన్న 11 మంది మున్సిపాల్‌ మహిళ కార్మికులకు రూ.10 కోట్ల విలువైన లాటరీ తగిలింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. దీంతో ఇన్నాళ్లు వారు పడ్డ కష్టాలన్నీ పోయాయని సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..