గౌతమ బుధ్ధుడు పుట్టింది నేపాల్ లోనే, ఇండియా క్లారిటీ

గౌతమ  బుధ్ధుడు ఎక్కడ పుట్టాడన్న వివాదాన్ని ఇండియా కొట్టిపారేసింది. బుధ్ధుడు, మహాత్ముడు ప్రవచించిన బోధనలు ఈ నాటికీ అనుసరణీయమేనంటూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యల...

గౌతమ బుధ్ధుడు పుట్టింది నేపాల్ లోనే, ఇండియా క్లారిటీ

Edited By:

Updated on: Aug 10, 2020 | 11:22 AM

గౌతమ  బుధ్ధుడు ఎక్కడ పుట్టాడన్న వివాదాన్ని ఇండియా కొట్టిపారేసింది. బుధ్ధుడు, మహాత్ముడు ప్రవచించిన బోధనలు ఈ నాటికీ అనుసరణీయమేనంటూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై నేపాల్ మీడియా వక్రీకరించి చేసిన ప్రచారంలో అర్థంలేదని భారత్ పేర్కొంది. గౌతమ బుధ్ధుడు భారతీయుడే అని భారత విదేశాంగ మంత్రి ప్రకటించారంటూ ఆ మీడియా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఖండించారు. మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యల సారాంశం అది కాదని, బుద్ధిజం విలువలను భారత్, నేపాల్ రెండూ పాటిస్తున్నాయని ఆయన అన్నారని శ్రీవాత్సవ వివరించారు. బుధ్ధుడు పుట్టింది నేపాల్ లోని లుంబినీలోనే అని తాము కూడా చెబుతున్నామన్నారు .

అటు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా జైశంకర్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపట్ల సైతం శ్రీవాత్సవ నిరసన వ్యక్తం చేశారు. మేము ఏమన్నామో తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us