Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు.. 19 మంది మృతి! దీని లక్షణాలు

మెదడున తినే అమీబా వ్యాధితో ఇప్పటికే కేరళలో 19 మంది మరణించారు. మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుందటంతో ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి..

Brain Eating Amoeba: వేగంగా వ్యాపిస్తున్న మెదడు తినే అమీబా కేసులు.. 19 మంది మృతి! దీని లక్షణాలు
Brain Eating Amoeba

Updated on: Sep 21, 2025 | 12:45 PM

బెంగళూరు, సెప్టెంబర్ 21: మెదడున తినే అమీబా వ్యాధి కేరళలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు. మరణాల సంఖ్య అక్కడ వేగంగా పెరుగుతుందటంతో ఆందోళన నెలకొంది. కేరళ రాష్ట్రంలో అమీబా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. హై అలర్ట్‌ జారీ చేశాయి. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో, దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

కేరళలో మెదడును తినే అమీబా విజృంభిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా ద్వారా వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా కేరళలో 19 మంది మరణించారు. 67 మందికి ఈ వ్యాధి సోకింది. ఈ అమీబా సాధారణంగా నిల్వ నీరు, చెరువులు, సరస్సులలో పెరుగుతుంది. అలాంటి నీటిలో ఈత కొడ్డం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మెదడులోకి నేరుగా ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ రేటు పెరిగి మరణం కూడా సంభవించవచ్చు.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు వంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 1 నుంచి 9 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇన్ఫెక్షన్ కు చికిత్స ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

  • చెరువులు, సరస్సులు, నిల్వ నీటిలో స్నానం చేయడం లేదా ఈత కొట్టడం చేయరాదు.
  • మంచినీటిలో ఈత కొట్టేటప్పుడు ముక్కు క్లిప్‌లను ఉపయోగించడం.
  • క్లోరిన్ ఉపయోగించి బావులు, నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం.
  • నిల్వ ఉన్న నీటిని తాకిన వారికి జ్వరం లేదా తలనొప్పి వంటి లక్షణాలు ఎదురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us