పంజాబ్ నుంచి 800 కి.మీ. కాలి నడకన.. సూట్ కేసుపైనే చిన్నారి నిద్ర

కరోనా  వైరస్ లాక్ డౌన్ 'చూపుతున్న  హృదయ విదారక దృశ్యాలు' ఇన్నీ అన్ని కావు. రోజుకొకటి కాదు.. పదుల సంఖ్యలో వలస కూలీల కష్టాలు బయటపడుతున్నాయి. ఉదాహరణకు పంజాబ్ నుంచి 800 కి.మీ. సుదూర్ఘ ప్రయాణానికి నడుం బిగించిందో పేద కుటుంబం..

పంజాబ్  నుంచి 800 కి.మీ. కాలి నడకన.. సూట్ కేసుపైనే చిన్నారి నిద్ర

Edited By: Anil kumar poka

Updated on: May 14, 2020 | 1:50 PM

కరోనా  వైరస్ లాక్ డౌన్ ‘చూపుతున్న  హృదయ విదారక దృశ్యాలు’ ఇన్నీ అన్ని కావు. రోజుకొకటి కాదు.. పదుల సంఖ్యలో వలస కూలీల కష్టాలు బయటపడుతున్నాయి. ఉదాహరణకు పంజాబ్ నుంచి 800 కి.మీ. సుదూర్ఘ ప్రయాణానికి నడుం బిగించిందో పేద కుటుంబం.. ఈ ఫ్యామిలీ ఝాన్సీ కి బయలుదేరింది. కాలి నడక తప్ప మరేదీ దిక్కులేదు. తన తల్లితో కలిసి నడవలేక ఓ చిన్నారి ఆమె లాగుతున్న సూట్ కేసుపైనే నిద్ర పోయిన వీడియో వీరి బాధలను కళ్ళకు కట్టింది. రైళ్లలోనో, బస్సుల్లోనో వెళ్ళవచ్చు కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అప్పటికే నడిచీ..నడిచీ అలసిపోయిన ఆ తల్లి ఏమీ మాట్లాడలేక పోయింది. ఎక్కడికి వెళ్తున్నారు అన్న ప్రశ్నకు ‘ఝాన్సీ’ అని మాత్రం సమాధానమిచ్చింది. మరో  కుటుంబం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి తమ చిన్న పిల్లలతో 500 కిలోమీటర్ల దూరానికి కాలినడక ప్రారంభించింది. ఇండోర్ లో వీరు పని చేస్తున్న ఇటుకల ఫ్యాక్టరీ మూతబడడంతో వీరికి ఈ దురవస్థ తప్పలేదు.