అమ్మకోసం 17ఏళ్ల బాలుడు భలే ఐడియా వేశాడు.. అతడు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా హాట్సాఫ్ అంటారు..

|

Oct 21, 2022 | 3:55 PM

వంటగదిలో పని చేసేలా, అతనికి కావాల్సిన ఆహారం, త్రాగడానికి నీళ్లు,జ్యూస్‌లు, కాఫీ, టీలు అందించే ఓ మహిళా కోసం అతడు భలే ఐడియా వేశాడు..

అమ్మకోసం 17ఏళ్ల బాలుడు భలే ఐడియా వేశాడు.. అతడు ఏం చేశాడో తెలిస్తే మీరు కూడా హాట్సాఫ్ అంటారు..
Kerala Made Lady Robot
Follow us on

ఇటీవల, గోవాకు చెందిన ఒక రోజువారీ కార్మికుడు అద్భుతాలు చేస్తూ, తన వికలాంగురాలైన కుమార్తె కోసం రోబోట్‌ను తయారు చేశాడు. ఆ రోబో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమెకు ఏం కావాలన్నా చేసిపెడుతుంది. ఆహారం అందిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కేరళకు చెందిన 17 ఏళ్ల బాలుడు తనలోని అద్భుతమైన ప్రతిభకు మరింత పదునుపెట్టాడు. వంటగదిలో పని చేసేలా, అతనికి కావాల్సిన ఆహారం, త్రాగడానికి నీళ్లు,జ్యూస్‌లు, కాఫీ, టీలు అందించే మహిళా రోబోట్‌ను తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని కన్నూర్ జిల్లాలో నివసిస్తున్న ఈ అబ్బాయి పేరు మహమ్మద్ షియాద్‌. అతని వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. కరోనా కాలంలో తన తల్లికి సహాయం చేయడానికి, జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ రోబోట్‌ను తయారు చేయాలనే ఆలోచన బాలుడికి వచ్చింది. ఇక దీంతోనే తల్లికి ఏదైనా సాయం చేస్తానని అనుకున్నాడు. ఆ తర్వాత దాని పని మొదలుపెట్టాడు. ఇంతలో, అబ్బాయికి స్కూల్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. అతను ఈ ప్రాజెక్ట్ కింద ఈ రోబోట్‌ను తయారు చేశాడు. రోబోను తయారు చేసేందుకు ప్లాస్టిక్, అల్యూమినియం షీట్లు, ఆడ డమ్మీలు, సర్వింగ్ ప్లేట్లు తదితరాలను ఉపయోగించారు. రోబోలో అల్ట్రాసోనిక్ సెన్సార్ అమర్చబడిందని బాలుడు స్వయంగా చెప్పాడు. ఈ సెన్సార్ ద్వారా ఇది నిర్వహించబడుతుంది. నియంత్రించబడుతుంది. దీని తయారీకి దాదాపు పదివేల రూపాయలు ఖర్చైనట్టుగా చెప్పారు.

ఈ లేడీ రోబోట్‌ను తన తల్లికి బహుమతిగా ఇచ్చాడు. అది తనకు ప్రతి విషయంలో సహాయం చేస్తుందని చెప్పాడు. ఆమె ఈ రోబోకు పథూటీ అని పేరు పెట్టింది. ఆమె దానిని అమ్మాయి దుస్తుల్లో అందంగా అలంకరించింది. ఈ రోబో వంటగదిలో సహాయపడుతుంది. డైనింగ్ హాల్ టేబుల్‌పై ఆహారాన్ని ఉంచుతుంది. ఇది కాకుండా నీటిని కూడా తెస్తుంది. ఈ రోబోకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి