Viral: పొదల వెనుక అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా పోలీసులు షాక్!

ఆ మైదానానికి చుట్టుప్రక్కల ఉండే స్థానికులు.. రోజూ పొద్దునే వాకింగ్, జాగింగ్ ఆ మైదానంలోనే చేస్తుంటారు. రోజూలాగే మొన్న ఆదివారం కూడా జనాలందరూ..

Viral: పొదల వెనుక అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా పోలీసులు షాక్!
Image Credit source: Representative Image

Updated on: Jun 07, 2022 | 10:52 AM

అదొకప్పుడు క్రీడా మైదానం.. కానీ ఇప్పుడు రాజకీయ, మతపరమైన సమావేశాలకు, ర్యాలీలకు, ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్లకు ఉపయోగిస్తున్నారు. ఇక ఆ మైదానానికి చుట్టుప్రక్కల ఉండే స్థానికులు.. రోజూ పొద్దునే వాకింగ్, జాగింగ్ ఆ మైదానంలోనే చేస్తుంటారు. రోజూలాగే మొన్న ఆదివారం కూడా జనాలందరూ కూడా ఆ మైదానంలో తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. వారిలో కొంతమంది పొదల నుంచి దుర్వాసన రావడాన్ని గమనించారు. ఇక ఆ ప్రదేశంలో అనుమాస్పదంగా ఓ ప్లాస్టిక్ బ్యాగ్‌ను చూశారు. ముందుగా దాన్ని చూసి భయపడిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. వారు అక్కడికి చేరుకొని బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా..

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ పోలీసులు ఆదివారం రాంలాలీ మైదానంలో తెగిపడిన శరీర భాగాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్రౌండ్‌లో పోలీస్ యూనిట్ పెట్రోలింగ్ చేస్తుండగా.. పొదల్లోంచి భయంకరమైన దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారాన్ని సమీపంలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు అందించారు.

సమాచారాన్ని అందుకున్న వెంటనే పాండవ్ నగర్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పొదల మాటున ఉన్న ఆ బ్యాగ్‌ను విప్పి చూడగా.. వారు షాక్ అయ్యే విధంగా అందులో తెగిబడిన శరీర భాగాలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని.. స్థానిక ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు పోలీసులు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ క్రైమ్ సైట్‌కు చేరుకొని క్లూస్ సేకరించగా.. దీనిపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.