మెడిసిన్‌ ఆన్‌లైన్‌ అమ్మకాలకు బ్రేక్‌..ఈ ఫార్మసీలకు షాక్‌

ఇప్పుడు ప్రపంచమంతా మన అరచేతిలోనే ఉంది.  ఏది కావాలన్నా బయటికి వెళ్లకుండానే క్షణాల్లో మన ఇంట్లోకి వచ్చేస్తాయి. చివరికి మెడిసిన్స్‌ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే డోర్‌ డెలివరీ చేసేస్తున్నారు. పైగా డిస్కౌంట్లు ఇచ్చి మరీ ఆకట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఐతే ఇటీవల ఢిల్లీ హైకోర్ట్‌ ఈ ఫార్మసీలకు షాకిచ్చే తీర్పిచ్చింది. దీంతో ఆన్‌లైన్‌లో మెడిసిన్స్‌ విక్రయంపై నిషేధం విధించింది కేంద్ర డ్రగ్స్‌ నియంత్రణ సంస్థ. ప్రస్తుతం […]

మెడిసిన్‌ ఆన్‌లైన్‌ అమ్మకాలకు బ్రేక్‌..ఈ ఫార్మసీలకు షాక్‌
Follow us

|

Updated on: Dec 06, 2019 | 5:37 PM

ఇప్పుడు ప్రపంచమంతా మన అరచేతిలోనే ఉంది.  ఏది కావాలన్నా బయటికి వెళ్లకుండానే క్షణాల్లో మన ఇంట్లోకి వచ్చేస్తాయి. చివరికి మెడిసిన్స్‌ కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే డోర్‌ డెలివరీ చేసేస్తున్నారు. పైగా డిస్కౌంట్లు ఇచ్చి మరీ ఆకట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఐతే ఇటీవల ఢిల్లీ హైకోర్ట్‌ ఈ ఫార్మసీలకు షాకిచ్చే తీర్పిచ్చింది. దీంతో ఆన్‌లైన్‌లో మెడిసిన్స్‌ విక్రయంపై నిషేధం విధించింది కేంద్ర డ్రగ్స్‌ నియంత్రణ సంస్థ.

ప్రస్తుతం మనదేశంలో మెడిసిన్స్‌ ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ఎలాంటి విధి విధానాలు లేవు. 80 ఏళ్ల క్రితం రూపొందించిన ఫార్ములానే ఫాలో అవుతున్నారు. మందులను విక్రయించేందుకు ఉన్న లైసెన్స్‌లతోనే ఈ ఫార్మసీలనూ నడుపుతున్నారు. దీంతో 2018లో జహీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. లైసెన్స్‌ లేకుండానే మెడిసిన్స్‌ విక్రయిస్తున్నారని..ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. మందులు ఈజీగా దొరకడం వల్ల వాటికి అడిక్ట్‌ అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐతే కోర్టులో తమ వాదనలు వినిపించిన ఈ ఫార్మసీలు..తమకు డ్రగ్స్‌ లైసెన్స్‌లు అవసరమే లేదని..తాము కేవలం వాటిని డెలివరీ చేస్తున్నామని వెల్లడించాయి.

ఇరువర్గాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్ట్‌ ఈ ఫార్మసీలకు షాకింగ్‌ జడ్జిమెంట్‌ ఇచ్చింది. కేంద్రప్రభుత్వం నూతన విధానాలను రూపొందించే వరకు లైసెన్స్‌ లేకుండా మెడిసిన్స్‌ ఆన్‌లైన్‌లో విక్రయించకుండా నిషేధం విధించింది. దీంతో హైకోర్ట్‌ తీర్పు మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డ్రగ్స్‌ రెగ్యులేటర్లకు లేఖలు రాసింది డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా. మరి ఇప్పటికైనా మెడిసిన్స్‌ అన్‌లైన్‌ అమ్మకాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందో లేదో వేచి చూడాలి.