Bjp spokesperson: ఆ ఆహారం మాత్రమే పెడతారా?.. ఇదేం విధానం..? ఫైర్ అయిన బీజేపీ ముఖ్య నేత..

Bjp spokesperson: విస్టారా ఎయిర్‌లైన్స్‌ పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర విమర్శలు చేశారు. విస్టారా ఎయిర్‌లైన్స్ తన..

Bjp spokesperson: ఆ ఆహారం మాత్రమే పెడతారా?.. ఇదేం విధానం..? ఫైర్ అయిన బీజేపీ ముఖ్య నేత..

Updated on: Feb 22, 2021 | 10:52 PM

Bjp spokesperson: విస్టారా ఎయిర్‌లైన్స్‌ పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర విమర్శలు చేశారు. విస్టారా ఎయిర్‌లైన్స్ తన ప్రయాణికులకు ‘హలాల్’ మాంసాన్ని మాత్రమే అందిస్తోందని ఆరోపించారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గౌరవ్ భాటియా సోమవారం నాడు కోల్‌కతా నుంచి ఢిల్లీకి విస్టారా ఫ్లైట్‌ వచ్చారు. ఢిల్లీ చేరుకున్న ఆయన.. విస్టారా సర్వీస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ సారాంశం.. భాటియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులకు విమాన సిబ్బంది భోజనం ఆఫర్ చేశారు. అయితే, వారు సర్వ్ చేస్తున్న నాన్‌వెజ్ ‘జక్తా’నా? ‘హలాలా’? అని ఆరా తీశారు భాటియా. కేవలం ‘హలాల్’ మాత్రమే అందుబాటులో ఉందని సిబ్బంది ఆయనకు బదులిచ్చారు. దాంతో విస్టారా సర్వీస్‌ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. హలాల్ మాత్రమే అందించడం వివక్షకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఆహారం విషయంలో ఇతరుల మనోభావాలకు విలువ ఇవ్వరా? అని ప్రశ్నించారు. హలాల్ అనేది ఇస్లామిక్ ఆహార విధానాల్లో భాగమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరిని గౌరవ్ భాటియా కోరారు. ‘సమానత్వం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. దానిని విస్టారా సంస్థ నిర్లక్ష్యం చేసింది. పూర్తి వివక్ష ప్రదర్శించింది. ఈ విధానాలను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ భాటియా కేంద్ర విమానయాన శాఖ మంత్రినికి అభ్యర్థించారు.

Gaurav Bhatia Tweet:

Also read:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

వాహనదారులకు పెద్ద ఊరట.. పెట్రోల్ ధరలను భారీగా తగ్గించిన రాష్ట్రాలు..