
వందేమాతరం గీతం చుట్టూ ఇప్పుడు దేశరాజకీయాలు వేడెక్కాయి. ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో మండిపడింది. వందేమాతరాన్ని వ్యతిరేకించేవారు మేధోపరంగా నిజాయితీ లేనివారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ విమర్శించారు.
మే 7, 2026న సోషల్ మీడియా ‘X’ వేదికగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన పోస్ట్ వివాదానికి కారణమైంది. వందేమాతరం ఒక దేవతను స్తుతించే స్తోత్రమని, దానిని జాతీయ గీతమైన ‘జన గణ మన’తో సమానం చేయలేమని పేర్కొన్నారు. ‘జన గణ మన’ ప్రజలను కీర్తిస్తుందని, కానీ వందేమాతరం ఒక మతపరమైన కోణాన్ని కలిగి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ గీత రచయిత బంకిం చంద్ర చటర్జీకి ముస్లింల పట్ల ప్రతికూల దృక్పథం ఉందని, అందుకే గతంలో గాంధీ, నెహ్రూ, ఠాగూర్ వంటి నేతలు దీనిని పూర్తిగా అంగీకరించలేదని ఒవైసీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారత ప్రజలమైన మేము అని ప్రారంభమవుతుందని, దేశాన్ని ఒక దేవతగా రాజ్యాంగం ఎక్కడా అభివర్ణించలేదని ఆయన స్పష్టం చేశారు.
Vande Mataram is an ode to a goddess. It cannot be treated on par with the national anthem. Jana Gana Mana celebrates India and its people, not a particular religion. Religion ≠ nation. The man who wrote Vande Mataram was sympathetic to the British Raj and despised Muslims.…
— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2026
ఒవైసీ వ్యాఖ్యలపై శుక్రవారం (మే 8, 2026) స్పందించిన తరుణ్ చుగ్, వందేమాతరం కేవలం ఒక పాట కాదని, అది భారత స్వాతంత్ర్య కాంక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. గత 150 ఏళ్లుగా వందేమాతరం విప్లవకారులకు మంత్రంగా పనిచేసిందని, ఈ నినాదంతోనే ఎంతోమంది ఉరికొయ్యలను ముద్దాడారని ఆయన గుర్తుచేశారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఇలాంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. వందేమాతరం పాడుతున్నప్పుడు నిలబడటం కేవలం ప్రభుత్వ నిబంధన మాత్రమే కాదని, అది 140 కోట్ల భారతీయుల హృదయాల స్వరమని చుగ్ వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi | On AIMIM President Asaduddin Owaisi's remarks on Vande Mataram, BJP National General Secretary Tarun Chugh says, “Vande Mataram is a declaration of the freedom fighters over 150 years… It was like a chant against the Britishers. Those who are against Vande… pic.twitter.com/WmbLJ6tKIF
— ANI (@ANI) May 8, 2026
వందేమాతరం అనేది దేశభక్తికి చిహ్నమని బీజేపీ వాదిస్తుండగా, అది రాజ్యాంగబద్ధమైన లౌకికవాదానికి విరుద్ధమని ఒవైసీ వాదిస్తున్నారు. ఈ మేధోపరమైన, రాజకీయ పోరాటం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..