ప్రతిపక్షాల చేతబడులు- బలౌతున్న బీజేపీ నేతలు : ఎంపీ ప్రగ్యా ఠాకూర్

ప్రగ్యా సింగ్ ఠాకూర్ పరిచయం అక్కరలేని బీజేపీ ఎంపీ. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇటీవల బీజేపీ అగ్రనేతలు మరణిస్తుండటంపై ఆమె తనదైన రీతిలో ప్రతిపక్షాలపై కామెంట్ చేశారు. బీజేపీ సీనియర్ నేతల మరణాలకు ప్రతిపక్షం చేతబడే కారణమని వ్యాఖ్యానించారు.ఇటీవల కన్నమూసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబూలాల్ గౌర్, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ సంతాప సభలో పాల్గొన్న సాధ్వి ప్రగ్యా… ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్రపూజలు […]

ప్రతిపక్షాల చేతబడులు- బలౌతున్న బీజేపీ నేతలు : ఎంపీ ప్రగ్యా ఠాకూర్

Updated on: Aug 26, 2019 | 4:16 PM

ప్రగ్యా సింగ్ ఠాకూర్ పరిచయం అక్కరలేని బీజేపీ ఎంపీ. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇటీవల బీజేపీ అగ్రనేతలు మరణిస్తుండటంపై ఆమె తనదైన రీతిలో ప్రతిపక్షాలపై కామెంట్ చేశారు. బీజేపీ సీనియర్ నేతల మరణాలకు ప్రతిపక్షం చేతబడే కారణమని వ్యాఖ్యానించారు.ఇటీవల కన్నమూసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబూలాల్ గౌర్, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ సంతాప సభలో పాల్గొన్న సాధ్వి ప్రగ్యా… ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు క్షుద్రపూజలు చేయిస్తున్నారని మహరాజ్ అనే సాధుడు ఒకప్పుడు తనకు చెప్పారని ఆమె తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే మాకు ఇప్పడు కాలం కలిసిరావడం లేదన్నారు. మహరాజ్ చెప్పిన విషయాన్ని నేను మర్చిపోయానని, ప్రస్తుతం తమ పార్టీకి చెందిన ఒక్కొక్కరూ మమ్మల్ని విడిచి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్నది చూస్తుంటే మహరాజ్ చెప్పింది నిజమే అనిపిస్తుందన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us