పెద్దల సభలో బీజేపీకి పెరిగిన బలం

రాజ్యసభలో బీజేపీకి బలం పెరిగింది. దేశంలో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది....

పెద్దల సభలో బీజేపీకి పెరిగిన బలం

Updated on: Jun 20, 2020 | 8:50 PM

రాజ్యసభలో బీజేపీకి బలం పెరిగింది. దేశంలో 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్, వైసీపీ చెరో 4 స్థానాలు కైవసం చేసుకున్నాయి. మరో మూడింటిని ఇతరులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరిగింది.

రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 86 మంది సభ్యులు ఉండగా, కాంగ్రెస్ బలం 41 మాత్రమే. మొత్తమ్మీద 245 సభ్యులతో కూడిన పెద్దల సభలో కూడా దాదాపు 100 సీట్లతో ఎన్డీయే ఆధిపత్యంలో ఉంది. ఏఐఏడీఎంకే 9 స్థానాలు, బీజేడీ 9 స్థానాలు, వైసీపీ 6 స్థానాలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు, నామినేటెడ్ సభ్యులు కూడా మద్దతు పలికితే, బిల్లుల సమయంలో బీజేపీ సర్కారుకు రాజ్యసభలోనూ సంఖ్యాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు.

Follow Us