
ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్‌కు బీజేపీలో కీలక పదవి లభించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా బీజేపీ ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్యా వీరప్పన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇక తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యకు రాష్ట్ర స్థాయిలో పదవిని కట్టబెట్టినట్లు సమాచారం. కాగా మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌గా పేరొందిన 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్ మృతి చెందిన విషయం తెలిసిందే.