ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ప్రమాదాలు.. ఫ్లైట్‌ను ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్!

పూణే నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI2470 ఒక పక్షితో ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమై ఫైలట్, పూణేలో సురక్షితంగా దించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసి, ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది ఎయిర్ ఇండియా సంస్థ. విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం పునరిద్దరిస్తామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎయిర్ ఇండియాను వెంటాడుతున్న ప్రమాదాలు.. ఫ్లైట్‌ను ఢీకొట్టిన పక్షి.. అత్యవసర ల్యాండింగ్!
Air India Flight Cancelled

Updated on: Jun 20, 2025 | 4:39 PM

గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా విమానాలు వరుస ప్రమాదాలను చవి చూస్తున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం AI2470 ఒక పక్షితో ఢీకొట్టింది. దీంతో విమానాన్ని పూణేలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించి, జూన్ 20న పూణే నుండి ఢిల్లీకి ఎగురుతున్న AI2470 విమానం పక్షి ఢీకొనడం వల్ల రద్దు చేయడం జరిగిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్‌కమింగ్ విమానం పూణేలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇది బయటపడింది. దర్యాప్తు కోసం విమానాన్ని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

మరోవైపు తనిఖీల నేపథ్యంలో ఎయిర్ ఇండియా జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ విమాన మార్గాల్లో విమానాలను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ సమయంలో, 3 విదేశీ మార్గాల్లో విమానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. ఈ లక్ష్యం ప్రోగ్రామ్ స్థిరత్వాన్ని పునరుద్ధరించడమేనని ఎయిర్‌లైన్ తెలిపింది. అలాగే, ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించాలని నిర్ణయించింది.

శుక్రవారం నాడు ఎయిర్ ఇండియా 8 విమానాలను రద్దు చేసింది. వీటిలో 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమానాలు ఉన్నాయి. నిర్వహణ, కార్యాచరణ కారణాల వల్ల విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్ పేర్కొంది. ఈ విషయంలో అధికారిక ప్రకటనలో ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. వీలైనంత త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రయాణీకులకు రద్దు, పూర్తి వాపసు లేదా రీషెడ్యూల్ సౌకర్యం కల్పించారు.

ఎయిర్ ఇండియా ఈ విమానాలు రద్దుః

  • దుబాయ్ నుండి చెన్నై-AI906
  • ఢిల్లీ నుండి మెల్బోర్న్ – AI308
  • మెల్‌బోర్న్ నుండి ఢిల్లీ-AI309
  • దుబాయ్ నుండి హైదరాబాద్-AI2204
  • పూణే నుండి ఢిల్లీ -AI874
  • అహ్మదాబాద్ నుండి ఢిల్లీ-AI456
  • హైదరాబాద్ నుండి ముంబై-AI-2872
  • చెన్నై నుండి ముంబై-AI571

గతంలో, వైడ్-బాడీ విమానాలతో నడిచే విమానాలను తాత్కాలికంగా 15 శాతం తగ్గిస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఈ తగ్గింపు జూలై 21 నుండి 15 వరకు కొనసాగుతుంది. ఢిల్లీ-నైరోబి, అమృత్‌సర్-లండన్ (గాట్విక్), గోవా (మోపా)-లండన్ (గాట్విక్) సర్వీసులు జూలై 15 వరకు నిలిపివేయడం జరిగింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, తూర్పు ప్రాంతాల నగరాలను అనుసంధానించే 16 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు తగ్గించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..