అడవుల్లో మావోయిస్ట్‌ల కోసం గాలిస్తుండగా కనిపించిన ఇనుప పెట్టే.. ఓపెన్ చేసి చూడగా..

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టుల భారీ డంప్ లభించింది. ఇంద్రావతి నది ప్రాంతంలో జరిపిన కూంబింగ్‌లో రూ.4.9 కోట్లకు పైగా విలువైన 3.84 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.24.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఇది మావోయిస్టుల ఆర్థిక మూలాలపై తీవ్ర దెబ్బ అని పోలీసులు తెలిపారు.

అడవుల్లో మావోయిస్ట్‌ల కోసం గాలిస్తుండగా కనిపించిన ఇనుప పెట్టే.. ఓపెన్ చేసి చూడగా..
Maoist Gold Cache Bijapur

Edited By:

Updated on: Nov 29, 2026 | 9:38 AM

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు భారీ డంప్ లభించింది. మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో పోలీసులు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ బయటపడింది. ఇంద్రావతి నది పరిసర అటవీ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో కోట్లాది రూపాయల విలువైన బంగారు బిస్కెట్లు, భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఆపరేషన్‌ లో భాగంగా అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన ఒక ఇనుప పెట్టెను భద్రతా బలగాలు గుర్తించాయి. దాన్ని తెరిచి చూడగా ఒక్కొక్కటి పది తులాలకు పైగా బరువున్న 33 బంగారు బిస్కెట్లు, రూ.24.22 లక్షల నగదు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం బరువు 3.84 కిలోలు ఉందని అధికారులు నిర్ధారించారు.

ఈ ఆపరేషన్ పై బీజాపూర్ ఎస్పీ ఉమేష్ ప్రసాద్ గుప్తా మాట్లాడుతూ.. మావోయిస్టుల ఉనికిపై అందిన కచ్చితమైన సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బాంబు స్క్వాడ్ బృందాలు సంయుక్తంగా ఇంద్రావతి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఈ తనిఖీల్లోనే మావోయిస్టుల రహస్య డంప్ బయటపడిందని పేర్కొన్నారు.

ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల విలువ రూ.4.9 కోట్లకు పైగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.మావోయిస్టుల ఆర్థిక మూలాలపై ఇది గట్టి దెబ్బని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో పరిసర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us