Bihar Boat Sank in Ganga: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం.. 10 మంది గల్లంతు.. 45 మంది సేఫ్..!

|

Sep 05, 2022 | 2:35 PM

Bihar Boat Sank in Ganga: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడింది. పశువుల మేతను తీసుకుని తిరిగి వస్తున్న 55 మంది అకస్మాత్తుగా గంగా..

Bihar Boat Sank in Ganga: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం.. 10 మంది గల్లంతు.. 45 మంది సేఫ్..!
Boat Accident
Follow us on

Bihar Boat Sank in Ganga: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడింది. పశువుల మేతను తీసుకుని తిరిగి వస్తున్న 55 మంది అకస్మాత్తుగా గంగా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ మరికొందరు గల్లంతయ్యారు. పడవ మునిగిపోవడంతో అంతా నదిలోకి దూకేశారు. అందులో ఈత వచ్చిన వారు ఒ‌డ్డుకు చేరాగా మిగిలిన వారు గల్లంతయ్యారు. చిన్నబోటులో పరిమితికి మించి ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు స్ధానికులు. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.45 మంది ఒడ్డుకు చేరారు.

రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది నదిని జల్లెడ పట్టారు. ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.

రోజులానే పశువుల మేత తెచ్చేందుకు కొందరు.. కూరగాయలు కోసేందుకు మరికొందరు గంగాహర ద్వీపానికి బయలు దేరారు. తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నదీ తీరానికి చేరి కన్నీరు మున్నీరవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..