Gujarat:గుజరాత్‌లోని పిపావవ్(Pipavav)పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. కొన్ని రోజుల కిందట పిపావవ్ పోర్ట్‌కు చాలా కంటైనర్లు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం స్పెషల్. దాని గురించి డీఆర్‌ఐ, గుజరాత్ ఏటీఎస్‌కు ఉప్పందింది. ఆ కంటైనర్‌ను తనిఖీ చేశారు అధికారులు. దాని బరువు పది వేల కేజీలకు కాస్త తక్కువ. దాంట్లో వంద పెద్ద సంచులు ఉన్నాయి. ఆ సంచుల్లో పురికోస ఉంది. కానీ నాలుగు సంచుల్లోనే ఉంది కథంతా. వాటిలో ఉన్నది కూడా పురికోసే. అయితే నిండా హెరాయిన్‌ను నింపుకున్న పురికోస అది. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ చేసిన ఫీల్డ్ టెస్ట్‌లో కానీ ఈ విషయం బయటపడలేదు. ఈ నాలుగు సంచులు కలిపి 395 కిలోల బరువు ఉన్నాయి. హెరాయిన్ రవాణాకు ఈసారి డ్రగ్స్ మాఫియా పూర్తిగా కొత్త పద్ధతి ఫాలో అయింది. హెరాయిన్ కలిపిన సొల్యూషన్‌లో పురికోసను ముంచి, ఆరబెట్టినట్టు అధికారులు గుర్తించారు. తర్వాత బేళ్లుగా చేసి, బ్యాగ్స్‌లో ప్యాక్ చేశారు. ఈ నాలుగు బ్యాగ్‌లను సాధారణ పురికోస ఉంచిన సంచులతో పాటు షిప్పింగ్ చేశారు. ఇలా చేస్తే అధికారుల కంటపడకుండా డ్రగ్స్‌ను చేరవేయవచ్చని మాఫియా ఎత్తుగడ. గమ్యం చేరిన తర్వాత పురికోస నుంచి హెరాయిన్‌ను ఎక్స్‌ట్రాక్ట్ చేయాలన్నది వారి ఆలోచన. దానికో ప్రత్యేక పద్ధతి ప్లాన్ చేశారు. అయితే అధికారులకు అందిన రహస్య సమాచారంతో మాఫియా గుట్టు రట్టు అయింది. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. వారం రోజుల్లో రూ. 2180కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
Also Read: Viral Video: యమపాశంలా దూసుకువచ్చిన బండ రాయి.. క్షణకాలంలో ఊహించని విషాదం..