Watch Video: సిట్టింగ్‌లో సిగరెట్‌ లైటర్‌ కోసం గొడవ.. కోపంతో ఫ్రెండ్‌ను ఏం చేశాడో చూడండి..

మద్యం తాగుతున్న సమయంలో లైటర్ కోసం ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఒక చిన్న గొడవ చిలికి, చిలికి చివరికి స్నేహితుడి ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఫుల్‌గా తాగిన తర్వాత లైటర్ కోసం ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన ఓ ఫ్రెండ్ తన స్నేహితుడిని కారుతో ఢీకొట్టి అతి దారుణంగా హత్య చేశాడు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో వెలుగు చూసింది.

Watch Video: సిట్టింగ్‌లో సిగరెట్‌ లైటర్‌ కోసం గొడవ.. కోపంతో ఫ్రెండ్‌ను ఏం చేశాడో చూడండి..
Bengaluru Murder

Updated on: Jan 27, 2026 | 5:55 PM

లైటర్ కోసం జరిగిన గొడవ కారణంగా ఓ ఫ్రెండ్ తన స్నేహితుడిని కారుతో ఢీకొట్టి అతి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగర సమీపంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరసంద్రకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు, విజ్ఞాన్ నగర్‌కు చెందిన రోషన్ హెగ్డే ఇద్దరూ ఫ్రెండ్స్. రోషన్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ప్రశాంత్ బాడీ బిల్డర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సండె రోజు బెంగళూరు సమీపంలోని కమ్మసంద్రలో జరిగిన క్రికెట్‌ టౌర్నమెంట్‌కు వెళ్లిన ఇద్దరూ మ్యాట్ తర్వాత వచ్చే దారిలో ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో సిగరెట్ లైటర్ కోసం ప్రశాంత్, రోషన్ మధ్య గొడవ జరిగింది.

మొదట చిన్నాగా మొదలైన గొడ చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ గొడవలో రోషన్ కాలికి గాయం కావడంతో అతను ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లేందుకు తన కారు తీశాడు. అది గమనించిన ప్రశాంత్ కారును వెంబడించి ఫుట్‌వేర్‌పై ఎక్కి కారు డోర్‌ను పట్టుకొని వేలాడాడు. ఆపమని రోషన్‌ను ఎంతవేడుకన్నా.. రోషన్ వినిపించుకోలేదు. దాదాపు 600 మీటర్ల వరకు అలాగే వెళ్లాడు. తర్వాత ఒక కాంపౌండ్ గోడను ఢీకొట్టి.. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ అక్కడికక్కడే మరణించాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థానిరి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై మొదట రోడ్డు ప్రమాదం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో భాగంగా కారు డ్యాష్‌ క్యామ్‌ను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రోషన్ ఉద్దేశపూర్వకంగానే ప్రశాంత్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో కేసును హత్య కేసుగా మార్చి ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందిన తర్వాత రోషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నగా మొదలైన గొడవ స్నేహితుడి ప్రాణం తీసే వరకు వెళ్లడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.