Bengal SSC Scam Case: బెంగాల్‌ SSC స్కామ్‌లో ఈడీ దూకుడు.. మంత్రి పార్థఛటర్జీ, అర్పిత నివాసాల్లో సోదాలు..

మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఇటీవలే ముఖర్జీ ఇంట్లో 21 కోట్లు జప్తు అయ్యాయి.

Bengal SSC Scam Case: బెంగాల్‌ SSC స్కామ్‌లో ఈడీ దూకుడు.. మంత్రి పార్థఛటర్జీ, అర్పిత నివాసాల్లో సోదాలు..
Arpita Mukherjee
Follow us

|

Updated on: Jul 27, 2022 | 8:54 PM

బెంగాల్‌ SSC స్కామ్‌లో మరోసారి నోట్ల గుట్టలు బయటపడ్డాయి. మంత్రి పార్థ ఛటర్జీ ఫ్రెండ్‌ అర్పితకు చెందిన మరో ఫ్లాట్‌ నుంచి 15 కోట్ల నగదును సీజ్‌ చేసింది ఈడీ. తన ఫ్లాట్‌ను మంత్రి పార్థ మినీ బ్యాంక్‌గా వాడారని ఈడీ అధికారులకు అర్పిత చెప్పినట్టు తెలుస్తోంది. స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో కేంద్ర ఏజెన్సీ ఈడి చర్య కొనసాగుతోంది. కోల్‌కతాలోని బెల్ఘరియాలో మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఫ్లాట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు దాడి చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నోట్లను లెక్కించేందుకు ఐదుగురు బ్యాంకు అధికారులను పిలిపించారు. దీంతో పాటు నగదు లెక్కింపు యంత్రాలను కూడా తెప్పించారు. ఎంత డబ్బు దొరికిందనే సంగతి ఇంకా వెల్లడించలేదు. ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అర్పితా ముఖర్జీ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల అరెస్టు చేశారు. జులై 22న ముఖర్జీ దాచిన స్థలంలో రూ.21 కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. తర్వాత, సుదీర్ఘ విచారణ తర్వాత పార్థ ఛటర్జీని కూడా అరెస్టు చేశారు.

డైరీ నుండి రహస్యాలు వెల్లడవుతాయి

గతంలో అర్పితా ముఖర్జీ నుంచి రెండు డైరీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలలో ఒకదానిలో అర్పితా ముఖర్జీ తన బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయడానికి ఉపయోగించిన నగదు గురించి సమాచారం ఉంది. అర్పితా ముఖర్జీకి ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈ డైరీలో పలుమార్లు వివిధ బ్యాంకుల్లో నగదు జమ చేసిన వివరాలున్నాయి. దొరికి నగదు లక్షల్లో ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..