స్వాతంత్ర పోరాట యోధుడు మావీరన్ అళగుముత్తు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన సద్గురు

Maveeran Alagumuthu: తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు  సద్గురు (జగ్గీ వాసుదేవ్) ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్వాతంత్ర పోరాట ఆధ్యుల్లో ఒక్కరైన మావీరన్ (మహావీరుడు) అళగుముత్తుకు సంబంధించిన వీడియో ఇది.

స్వాతంత్ర పోరాట యోధుడు మావీరన్ అళగుముత్తు.. స్పెషల్ వీడియో షేర్ చేసిన సద్గురు
Maveeran Alagumuthu

Updated on: Aug 03, 2022 | 6:15 PM

Azadi Ka Amrut Mahotsav: దేశ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్ర పోరాట యోధులను దేశం స్మరించుకుంటోంది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నా.. చరిత్ర పుటల్లో చోటు దక్కించుకోని విప్లవవీరులు కూడా తెరపైకి వస్తున్నారు. పలువురు చరిత్రకారులు, ప్రముఖులు వారిని వెలుగులోకి తీసుకొస్తున్నారు. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు  సద్గురు (జగ్గీ వాసుదేవ్) ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్వాతంత్ర పోరాట ఆధ్యుల్లో ఒక్కరైన మావీరన్ (మహావీరుడు) అళగుముత్తుకు సంబంధించిన వీడియో ఇది. 1700లలో బ్రిటీష్ పాలకులు దేశాన్ని ఆక్రమిస్తున్న సమయంలో పలువురు విప్లవకారులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. అలాంటి విప్లవవీరుల్లో మావీరన్ అళగుముత్తు కూడా అగ్రగణ్యుడని కొనియాడారు. 1759లోనే స్వాతంత్ర పోరాటానికి ఆయన భీజం వేశారని సద్గురు కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..