
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గత కొన్ని వారాలుగా సాగిన ప్రచారపర్వానికి ఇప్పటికే ఎండ్ కార్డ్ పడగా.. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈసారి కేరళ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు కూటములు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సీఎం పినరయి విజయన్ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుని రికార్డు సృష్టించాలని ఎల్డీఎఫ్ చూస్తోంది. సుపరిపాలన – సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని ఎల్‌డిఎఫ్ నమ్ముతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇందిరా గ్యారెంటీలు వంటి వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షిస్తోంది. ఎన్డీఏ, ఈసారి కేరళలో బలమైన ముద్ర వేయాలని చూస్తోంది. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. అస్సాంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది.
కేరళలో పెన్షన్ల పెంపు, ఉచిత వైద్యం వంటి అంశాలు ఓటర్ల మనసు గెలుచుకోవడంలో కీలకం కానున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, యువత వలసల అంశం ఈసారి ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. మెట్రో విస్తరణ, విజింజం పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై పార్టీల మధ్య హామీల యుద్ధం సాగింది. కాగా 2021 ఎన్నికల్లో 74.06 శాతం పోలింగ్ నమోదవ్వగా, ఈసారి ఆ శాతం పెరుగుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ శాతంలో వచ్చే స్వల్ప మార్పులు కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ముందస్తు సర్వేలు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వకపోవడంతో, సామాన్య ఓటరు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
అస్సాంలోని దిఫు నియోజకవర్గంలో పోలింగ్ బూత్ లోపల వీడియో తీసినందుకు ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. దిఫు నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ లోపల జరుగుతున్న ప్రక్రియను చూపిస్తూ.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా యంత్రాంగం ఈ ఫిర్యాదును దాఖలు చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పోలింగ్ బూత్‌ల లోపల మొబైల్ ఫోన్లు నిషేధం. లోపలికి ప్రవేశించే ముందు మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను డిపాజిట్ చేయడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
పుదుచ్చేరిలోని మన్నడిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. తిరుకనూర్ గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ సమీపంలో బీజేపీ కార్యకర్తల బృందం నిలబడి ఉంది. అక్కడ ఓటర్లు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. దీంతో వాగ్వాదం జరిగి, తోపులాటకు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అస్సాంలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 75.91% ఓటింగ్ నమోదైంది. కేరళలో 62.71% ఓటింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో 72.40% ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
State Assembly Elections | Approximate voter turnout as of 3 pm
Assam – 75.91%
Keralam – 62.71%
Puducherry – 72.40% pic.twitter.com/j4ySzV2Lgp— ANI (@ANI) April 9, 2026
త్రిస్సూర్‌లో ఓటు వేయడానికి గంటన్నర పాటు క్యూలో నిలబడిన 62 ఏళ్ల వ్యక్తి, ఓటు వేసిన వెంటనే మరణించాడు. వానియంపరలో ఓటు వేసిన తర్వాత 62 ఏళ్ల వ్యక్తి అస్వస్థతకు గురై, కొద్దిసేపటికే మరణించాడు. మృతుడిని వానియంపర సమీపంలోని రామన్‌చిర నివాసి వినోదన్‌గా పోలీసులు గుర్తించారు. వినోదన్ ఉదయం తన ఓటు వేయడానికి వానియంపరలోని ఈకేఎం యూపీ పాఠశాలకు వచ్చాడు. ఓటు వేయడానికి ముందు అతను సుమారు గంటసేపు క్యూలో నిలబడ్డాడు.
ఆకాశం మేఘావృతమై, అడపాదడపా వర్షం కురుస్తున్నప్పటికీ, అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలిసారి ఓటు వేస్తున్న వారి నుండి వృద్ధుల వరకు, అన్ని వయసుల వారిలో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, గౌహతితో సహా కొన్ని చోట్ల ఉదయం నుండి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ, వాతావరణం ఓటింగ్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. జోర్హాట్, కామరూప్, కోక్రాఝర్, లఖింపూర్ వంటి జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల బయట పొడవైన క్యూలు కనిపించాయి. 126 స్థానాలున్న ఈ శాసనసభకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గౌహతిలో తన భార్య రినికి శర్మ, పిల్లలతో కలిసి ఓటు వేశారు. జలుక్‌బరి నుంచి మూడోసారి పోటీ చేస్తున్న హిమంత, కామాఖ్య ఆలయంతో సహా పలు పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
#WATCH | Keralam CM Pinarayi Vijayan casts his vote in Assembly elections, at Pinarayi RC Amala Basic Upper Primary School in Kannur pic.twitter.com/yIVgSmzdPh
— ANI (@ANI) April 9, 2026
#WATCH | Puducherry Elections 2026 | A robot, Nila welcomes voters arriving at VOC Govt School to exercise their franchise. https://t.co/0nisPCPdhr pic.twitter.com/HMZoKuQJnf
— ANI (@ANI) April 9, 2026