సీఏఎపై రేగిన హింస.. డ్యామేజ్ కంట్రోల్ లో బీజేపీ

సవరించిన పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగానే కాక, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో రేగిన నిరసనలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింస పెచ్ఛరిల్లడం, విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగి, రైల్వే, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లడాన్ని పాలక పార్టీ గమనించింది. ఈ ఆందోళనల కారణంగా ఒక్క రైల్వే శాఖకే సుమారు 90 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా. […]

సీఏఎపై రేగిన హింస.. డ్యామేజ్ కంట్రోల్ లో బీజేపీ
Follow us

|

Updated on: Dec 21, 2019 | 7:37 PM

సవరించిన పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగానే కాక, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో రేగిన నిరసనలను బీజేపీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాలతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింస పెచ్ఛరిల్లడం, విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగి, రైల్వే, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లడాన్ని పాలక పార్టీ గమనించింది. ఈ ఆందోళనల కారణంగా ఒక్క రైల్వే శాఖకే సుమారు 90 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా. పైగా యూపీలో అత్యధికంగా పోలీసు కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అధికారిక సమాచారం మాత్రమే.. పలువురు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, రచయితలు తదితరులెందరో ఈ చట్టం పట్ల నిరసన వ్యక్తం చేశారు. దీంతో తన ‘ ప్రతిష్ట ‘ మసకబారుతోందని గ్రహించిన కమలనాథులు పరిస్థితిని చల్లబరచి, తమకు అనువుగా మార్చుకునేందుకు నడుం బిగించారు. . రానున్న 10 రోజుల్లో ఇండియాలో దాదాపు 3 కోట్ల కుటుంబాలను కలుసుకుని ఈ చట్టంపై ఆయా కుటుంబాలవారికి అవగాహన కల్పించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వందలాది ర్యాలీలను ,250 కి పైగా ప్రెస్ కాన్ఫరెన్సులను నిర్వహించాలని తీర్మానించింది. ఈ చట్టంపై ప్రజల్లో కలిగిన అపోహలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు పూనుకొంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జే.పీ.నడ్డా అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి.

ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్.. ఈ చట్టం విషయంలో కాంగ్రెస్ తో బాటు ప్రతిపక్షాలు చెబుతున్న ‘ అబధ్ధాలకు ‘ తాము కౌంటర్ ఇస్తామన్నారు. బంగ్లాదేశ్ లో వేధింపులను ఎదుర్కొంటున్న మైనారిటీలకు భారతపౌరసత్వం ఇవ్వవచ్చునని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఏఏ గురించి ప్రజలకు వివరించేందుకు ఆడియో-విజువల్ మీడియంను ఉపయోగించుకునే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఈ నెల 18 న చేసిన సూచనకు అనుగుణంగా బీజేపీ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన 59 పిటిషన్లను కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు-ప్రజల గొంతును ఈ బీజేపీ ప్రభుత్వం నొక్కివేస్తోందని, దారుణంగా అణచివేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శుక్రవారం దుయ్యబట్టారు.ఇలాఉండగా.. సీఏఏలో మార్పులు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సుముఖంగా ఉందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి.

డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక