Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..

|

Dec 15, 2021 | 3:35 PM

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌కు మరింత ఊరట లభించింది. ప్రతి వారం ఎన్సీబీ విచారణ నుంచి ఆర్యన్‌కు మినహాయింపును ఇచ్చింది బాంబే హైకోర్టు. . ముంబై ఎన్సీబీ..

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..
4 – డ్రగ్స్-క్రూయిజ్ కేసులో అరెస్టయి 25 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన తర్వాత నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 28న బెయిల్ పొందాడు. అక్టోబరు 2న ముంబై నుంచి గోవాకు వెళ్తున్న "కోర్డెలియా" క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ దాడులు నిర్వహించింది. అనంతరం కొన్ని గంటల తర్వాత ఆర్యన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అదుపులోకి తీసుకుంది. ఆర్యన్, అతని సన్నిహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్మున్‌తో సహా ఎనిమిది మంది వ్యక్తులు ఉన్నారు. ఆర్యన్, అర్బాజ్, మున్మున్‌లకు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్‌సిబి ఆరోపించిన విధంగా నిందితుల మధ్య కుట్ర ఉన్నట్లు చూపించడానికి తగిన సాక్ష్యాలు లేవని కోర్టు పేర్కొంది.
Follow us on

ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌కు మరింత ఊరట లభించింది. ప్రతి వారం ఎన్సీబీ విచారణ నుంచి ఆర్యన్‌కు మినహాయింపును ఇచ్చింది బాంబే హైకోర్టు. . ముంబై ఎన్సీబీ కార్యాలయానికి ప్రతి వారం ఆర్యన్‌ రావాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసులో ఢిల్లీ సిట్‌ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని ఆదేశించింది. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు ఇప్పటికే బాంబే హైకోర్లు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆర్యన్‌ ఎలాంటి కుట్ర చేయలేదని స్పష్టం చేసింది.

ఈ కేసులో బెయిల్‌పై విడుదలయ్యాడు ఆర్యన్‌ఖాన్‌. ప్రతి వారం ఎన్సీబీ కార్యాలయానికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని తాజాగా వేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది.

ఇవి కూడా చదవండి: Modi Meet MPs: దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో మోడీ కీలక భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!

CM KCR – CM Stalin: తాజా రాజకీయాలపై ఇద్దరు నేతల భేటీ.. కలిసి పోరాటం నిర్ణయం..