Viral Video: ఆర్మీ అధికారిపై దాడి.. కట్‌చేస్తే.. టోల్‌ ఏజెన్సీకి NHAI ఊహించని షాక్.. ఏం చేసిందంటే?

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక సైనిక అధికారిపై టోస్‌ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో ఘటనపై స్పందించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మీరట్‌లోని భూని టోల్ ప్లాజా ఏజెన్సీకి రూ. 20 లక్షల జరిమానా విధించింది.

Viral Video: ఆర్మీ అధికారిపై దాడి.. కట్‌చేస్తే.. టోల్‌ ఏజెన్సీకి NHAI ఊహించని షాక్.. ఏం చేసిందంటే?
Army Soldier's Assault

Updated on: Aug 19, 2025 | 12:39 PM

ఒక ఆర్మీ ఉద్యోగిపై టోల్‌ సిబ్బంది దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది. మీరట్-కర్నాల్ జాతీయ రహదారి 709A పై ఉన్న భూని టోల్ ప్లాజా వద్ద ఈ నెల 17న ఈ ఘటన చోటుచేసుకుంది. గోట్కా గ్రామానికి చెందిన కపిల్ అనే సైనికుడు సెలవు తర్వాత తిరిగి విధులకు వెళ్తుండగా టోల్‌ సిబ్బందితో వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరగడంతో ఈ గొడవ కాస్తా పెద్దదైనట్టు తెలుస్తోంది. దీంతో రెచ్చిపోయిన టోల్‌ సిబ్బంది ఆర్మీ అధికారిపై దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా సైనికుడిపై దాడి చేశారు. అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో ఈ వీడియోలు కాస్తా వైరల్‌గా మారి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ( NHAI) దృష్టికి చేరాయి. దీంతో ఈ ఘటనకు NHAI బాధ్యత వహిస్తూ.. మీరట్‌లోని భూని టోల్ ప్లాజా నిర్వహణ ఏజెన్సీపై చర్యలు తీసుకుంది. ఏజెన్సీకి రూ.20 లక్షల జరిమానా విధించినట్లు సోమవారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది. అంతే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి టోల్ ప్లాజా బిడ్‌లలో పాల్గొనకుండా టోల్ వసూలు సంస్థను తొలగించే ప్రక్రియను ప్రారంభించినట్లు NHAI పేర్కొంది.

సిబ్బంది క్రమశిక్షణను, పరిస్థిని అదుపు చేయడంలో ఏజెన్సీ విఫలమవడం కాంట్రాక్ట్ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. టోల్ ప్లాజా సిబ్బంది ఇటువంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని, జాతీయ రహదారులపై సురక్షితమైన, సజావుగా సాగే ప్రయాణానికి అనుకూలమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని NHAI తెలిపింది.

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సైనికుడిపై దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో సచిన్, విజయ్, అనుజ్, అంకిత్, సురేష్ రాణా, అంకిత్ శర్మ, నీరజ్ తాలియన్ అలియాస్ బిట్టులు ఉన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.