
దేశ రాజధాని ఢిల్లీ భారత్ మండపం వేదికగా ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ప్రారంభమైంది. నవంబర్ 14-27 వరకు జరగనున్న ట్రేడ్ ఫేర్ లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ అద్భుతంగా, అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ ఈ పెవిలియన్‌ను అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మంత్రులతో కాకుండా పెవిలియన్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు,అపురూపమైన హస్తకళల నైపుణ్యాన్ని,ప్రత్యేక ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికపై సగర్వంగా ప్రదర్శిస్తూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ను అంబరాన్ని తాకేలా చేస్తున్న ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తుంది..
ఈ అంతర్జాతీయ స్థాయి ట్రేడ్ ఫేర్‌లో ఆంధ్రప్రదేశ్ 28 జిల్లాల నలుమూలల నుంచి సుమారు 200 మందికి పైగా చేనేత కళాకారులు, హస్తకళాకారులు , వినూత్న ఉత్పత్తుల తయారీదారులు స్వయంగా పాల్గొని అమ్ముకునే విధంగా ప్రత్యేక 42 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక కళాకారుల ప్రతిభకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా, ఏపీ వ్యాపారుల వ్యాపారాన్ని మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది
ఏపీకి మాత్రమే ప్రత్యేకమైన, దేశంలో ఎక్కడా లభించని ఎన్నో అరుదైన కళాఖండాలు ఈ పెవిలియన్‌ను సందర్శించే వారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మంగలగిరి, వెంకటగిరి, ధర్మవరం ప్రాంతాలకు చెందిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చేనేత వస్త్రాలు. అద్భుతమైన నైపుణ్యంతో రూపుదిద్దుకున్న కలంకారి వస్త్ర కళాఖండాలు. చిన్నారులను, పెద్దలను ఒకేలా అలరించే ప్రసిద్ధ ఏటికొప్పాక , కొండపల్లి చెక్క బొమ్మలు.ఆకట్టుకునే విశాఖపట్నం లాకో వస్తువులు, అలాగే శ్రీకాకుళం, వైజాగ్ ప్రాంతాల గిరిజన ప్రత్యేక ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
అలాగే జిల్లాల వారీగా తిరుపతి పెన్ కలంకారి ,వుడ్ కార్వింగ్ కృష్ణ కలంకారి, ఇమిటేషన్ జ్యువెల్లరీ ,జీడిపప్పు,పశ్చిమ గోదావరి క్రోచెట్ లేస్ సత్యసాయి లెదర్ పప్పెట్రీ ,పల్నాడు ఫుడ్ ఐటమ్స్,ఏలూరు కార్పెట్ ,నెల్లూరు వుడెన్ కట్లరీ ,తూర్పు గోదావరి క్రోచెట్ లేస్ ప్రకాశం పచ్చళ్ళు,కోనసీమ చెక్క బొమ్మలు,ఎన్టీఆర్ హెర్బల్ ప్రొడక్ట్స్, బాటిక్ ప్రింట్ చీరలు,కాకినాడ కలంకారి డ్రెస్సులు,మాంగో జెల్లీ వైఎస్ఆర్ కడప సిల్క్ చీరలు,బాపట్ల చేనేత చేతితో ముద్రించిన వస్తువులు ,గుంటూరు మంగళగిరి చీరలు,పచ్చళ్ళు ,నంద్యాల జూట్, కాటన్ బ్యాగులు, ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ వంటి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి
ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేక ప్రొడక్ట్
ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేక ప్రొడక్ట్‌ను జాతీయ స్థాయికి పరిచయం చేసేలా ఈసారి ట్రేడ్ ఫేర్ లో ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేశారు.. ఏపీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ప్రసిద్ధ అరకు ఫిల్టర్ కాఫీ ఘుమఘుమలు, అలాగే నెల్లూరు వుడెన్ కట్లరీ ఉత్పత్తుల అందం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటూ పెవిలియన్‌కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తున్నాయి
జాతీయ స్థాయిలో ఏపీ బ్రాండింగ్!
దేశంలో మరెక్కడా లభించని అత్యంత ప్రత్యేకమైన చేనేత మరియు హస్తకళా ఉత్పత్తులు ఏపీలో ఉన్నాయన్నారు ఏపీ భవన్ స్పెషల్ రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్.. ట్రేడ్ ఫేర్ వేదికగా జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి వస్తువులకు వస్తున్న గుర్తింపు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతుందన్నారు…. గత ఏడాది కూడా ఏపీ స్టాల్స్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, ఇక్కడి వ్యాపారులు మంచి లాభాలు ఆర్జించారని గుర్తుచేశారు.. ఇలాంటి ట్రేడ్ ఫెర్ లు స్థానిక తయారీదారులకు బిజినెస్ ప్రమోషన్ మరింత పెరిగి మంచి ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.