AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చుట్టూ జనం చూస్తుండగానే.. యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారుల మధ్య వాగ్వాదాలు జరగడం సాధారణమే. అయితే కొన్నిసార్లు చిన్నపాటి వివాదాలు తీవ్ర ఘర్షణలకు దారితీస్తుంటాయి. ఇలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్కూటర్ ఢీకొన్న ఘటన తర్వాత ఓ మహిళ నడిరోడ్డుపై యువకుడిపై దాడికి దిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుడిని పదేపదే కొడుతూ, జుట్టు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Woman Attacks Man On Road
Balaraju Goud
|

Updated on: Nov 14, 2026 | 12:52 PM

Share

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారుల మధ్య వాగ్వాదాలు జరగడం సాధారణమే. అయితే కొన్నిసార్లు చిన్నపాటి వివాదాలు తీవ్ర ఘర్షణలకు దారితీస్తుంటాయి. ఇలాంటి ఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్కూటర్ ఢీకొన్న ఘటన తర్వాత ఓ మహిళ నడిరోడ్డుపై యువకుడిపై దాడికి దిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. యువకుడిని పదేపదే కొడుతూ, జుట్టు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

స్కూటర్ ప్రమాదంతో మొదలైన వివాదం!

ఓ స్కూటర్ ప్రమాదం తర్వాత మహిళకు, యువకుడికి మధ్య వివాదం మొదలైంది. ఈ ఘటనలో ఇద్దరి తప్పు ఉన్నప్పటికీ మహిళ మాత్రం యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగినట్లు వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి తప్పు ఎంత ఉంది? అనే విషయాలు మాత్రం వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు.

నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని దాడి!

వైరల్ వీడియోలో రోడ్డుపై ఓ స్కూటర్ పార్క్ చేసి ఉండగా, నలుపు, తెలుపు రంగుల చారల టీషర్ట్ ధరించిన యువకుడు దాని పక్కన నిలబడి కనిపించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ మహిళ అతడితో వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో ఒక్కసారిగా యువకుడిని తోస్తూ కొట్టడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా పలుమార్లు అతడి దగ్గరకు వెళ్లి పదేపదే దాడి చేసింది. అతడి జుట్టు పట్టుకుని లాగుతూ కొట్టడం కూడా వీడియోలో కనిపిస్తోంది. మరో వ్యక్తి ఈ ఘర్షణలో జోక్యం చేసుకుంటూ యువకుడిని నెట్టినట్లు కనిపిస్తోంది.

నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు!

ఈ ఘటనను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. కొందరు గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “తిరిగి దాడి చేయకుండా సంయమనం పాటించిన యువకుడికి అభినందనలు” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “ఒక పురుషుడిపై ఈ విధంగా దాడి చేసే హక్కు మహిళకు ఉందా?” అంటూ మరొకరు ప్రశ్నించారు. మొత్తానికి రోడ్డు ప్రమాదం పేరుతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా, తప్పు ఎవరిదైనా సరే.. సమస్యలను దాడులు, హింసతో పరిష్కరించుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యువకుడి జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టిన యువతి..!

4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!

అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..

అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?

జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..

15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?

ఏముంది మావ ఈ సాంగ్.. ఆర్జీవీ ఫేవరెట్ సాంగ్.. ఇంతకీ మీరు విన్నారా.

గీజర్‌ను ఆన్ చేసేటప్పుడు ఈ సాంకేతాలు కనిపిస్తే వెంటనే ఆఫ్‌ చేయండి

కారు బ్రేక్‌డౌన్.. కంత్రీ గాళ్ల ప్లాన్ ఫ్లాప్

పాకిస్తానీ యువతికి భారత్‌పై అంత ప్రేమా?
పాకిస్తానీ యువతికి భారత్‌పై అంత ప్రేమా?
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో