Amit Shah Tour Cancels: ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్‌ పర్యటన రద్దు

|

Jan 29, 2021 | 11:57 PM

Amit Shah Tour Cancels: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు జరగడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌ పర్యటన..

Amit Shah Tour Cancels: ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్‌ పర్యటన రద్దు
Follow us on

Amit Shah Tour Cancels: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు జరగడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌ పర్యటన రద్దు అయింది. నిజానికి ఆయన రెండురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతాకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ పేలుడు ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఘటనపై అధికారులతో సమావేశమై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాు. ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని ముఖ్యమైన నగరాల్లో అలర్ట్‌ ప్రకటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌ కూడా అమిత్‌షాతో సమావేశం అయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటనలో వాహనాల అద్దాలు సైతం ధ్వంసం అయ్యాయి. అధికారులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. ఇజ్రాయిల్ ‌ అధికారులతో కలిసి ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, శుక్రవారం సాయంత్రం జరిగిన బాంబు పేలుడుతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగనప్పటికి అధికారులు అప్రమత్తం అయ్యారు. బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమం జరుగుతున్న విజయ్‌ చౌక్‌కు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ పేలుడు జరగడంతో ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.

High Alert: ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న సీఐఎస్ఎఫ్.. దేశవ్యాప్తంగా ఉన్న..