Bhagwant Mann: “ఫుల్లుగా మద్యం తాగి నడవలేని స్థితిలో.. విమానం నుంచి దించేశారు”.. పంజాబ్ సీఎంపై గుప్పుమన్న ఆరోపణలు

|

Sep 19, 2022 | 4:29 PM

పంజాబ్ (Punjab) సీఎం భగవంత్ మాన్ పై అకాలీదళ్ అధినేత సుఖ్వీర్ సింగ్ బాదల్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని పరిస్థితుల్లో పంజాబ్ ముఖ్యమంత్రిని విమానం నుంచి దించేశారని...

Bhagwant Mann: ఫుల్లుగా మద్యం తాగి నడవలేని స్థితిలో.. విమానం నుంచి దించేశారు.. పంజాబ్ సీఎంపై గుప్పుమన్న ఆరోపణలు
Cm Bhagwant Mann
Follow us on

పంజాబ్ (Punjab) సీఎం భగవంత్ మాన్ పై అకాలీదళ్ అధినేత సుఖ్వీర్ సింగ్ బాదల్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని పరిస్థితుల్లో పంజాబ్ ముఖ్యమంత్రిని విమానం నుంచి దించేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం మాన్​తో పాటు జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​నుంచి అదే విమానంలో ఢిల్లీకి వస్తున్న ప్రయాణీకులు ఈ విషయాన్ని చెప్పారని ఆయన వెల్లడించారు. మద్యం మత్తులో ఉన్న మాన్ ను విమానం నుంచి దించేశారని, దీని వల్ల విమానం 4 గంటలు ఆలస్యమైందని బాదల్ పేర్కొన్నారు. దీంతో ఆప్​నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేకపోయారని చెప్పారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పంజాబీల మనోభావాలను దెబ్బతీశాయని, సీఎం తీరుతో వారు అవమానకరంగా భావించారని వివరించారు. విషయంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం దాలుస్తోందని, అసలు ఏం జరిగిందో చెప్పాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని, ఆయనను విమానం నుంచి దించేయడం నిజమో కాదో తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన నిజం అని నిరూపితమైతే జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలని ట్వీట్ చేశారు.

కాగా.. ఈ ఘటనపై పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సైతం విస్మయం వ్యక్తం చేశారు. సీఎం మాన్​ది తప్పని నిరూపితమైతే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ప్రభుత్వాన్ని ఢీల్లీ దర్బార్ నడిపిస్తోందంటూ కేజ్రీవాల్, రాఘవ్ చడ్ఢాలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇటీవల 8 రోజుల జర్మనీ పర్యటనకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వెళ్లారు. ఆదివారం భారత్​కు తిరిగొచ్చారు. అయితే ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యమైంది. దీంతో ఆయన మద్యం తాగి నడవలేని పరిస్థితుల్లో విమానం నుంచి దించేశారనే వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్తలను ఆమ్​ఆద్మీ పార్టీ ఖండించింది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడింది. పంజాబ్ కు మంచి పేరు తీసుకువచ్చేందుకు ఆయన రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, దీనిని చూసి ఓర్వలేక ఇలాంటి పాలిటిక్స్ కు తెరలేపాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన షెడ్యూల్ ప్రకారమే జర్మనీ వెళ్లి, తిరుగొచ్చారని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..