Viral Note: శ్రీరాముని ఫోటోతో కొత్త రూ. 500 నోటు.. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వైరల్..

|

Jan 17, 2024 | 11:15 AM

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో రూ. 500 సంబంధించిన అంశం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రూ. 500 నోట్లపై గాంధీ బొమ్మకు బదులు శ్రీరాముని చిత్రాన్ని ముద్రిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

Viral Note: శ్రీరాముని ఫోటోతో కొత్త రూ. 500 నోటు.. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వైరల్..
Viral Rs. 500 Note
Follow us on

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ సమయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో రూ. 500 సంబంధించిన అంశం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారింది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రూ. 500 నోట్లపై గాంధీ బొమ్మకు బదులు శ్రీరాముని చిత్రాన్ని ముద్రిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవైపు శ్రీరాముని చిత్రపటాన్ని అచ్చు వేయగా.. నోటుకు మరొక భాగంలోని ఎర్రకోట స్థానంలో అయోధ్య ఆలయా నమూనాను ముద్రించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛ భారత్ అని గాంధీజీ కళ్ల జోడు ఉంటే స్థానంలో శ్రీరాముని బాణం, విల్లు ఉండేలా రూపొందించారని దీనికి సంబంధించిన ఫోటో వైరల్గా మారింది. ఈ నోటును జనవరి 22న రామమందిర ప్రతిష్ఠాపన రోజు జారీ చేయనున్నట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక కట్ కట్ చేస్తే ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క అంశాన్ని వక్రీకరిస్తూ వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. అలాగే ఈ రూ. 500 నోటు విషయంపై కూడా దుష్ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. గతంలోనే కొత్తగా ముద్రించిన ఈ రూ. 500 నోటును ఇప్పట్లు రద్దు చేసే అవకాశాలు ఏ కోణంలో కూడా కనిపించడం లేదు.

ఈ నోట్ల మార్పునకు సంబంధించిన ఎలాంటి విషయాలను ఆర్బీఐ ప్రకటించలేదు. 1996లో కరెన్సీ నోట్లపై అశోకుడి స్థూపం స్థానంలో మహాత్మా గాంధీ సిరీస్‌ను ముద్రించడం ఆర్బీఐ ప్రారంభించింది. అప్పటి నుంచి కరెన్సీ నోట్లపై గాంధీజీ చిత్రమే ఉంటోంది. గాంధీజీ చిత్రం స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖుల ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారని ఏడాదిన్నర క్రితం ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేం లేదని రిజర్వ్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే శ్రీరాముని చిత్రాన్ని ముద్రించనున్నట్లు ప్రచారం సాగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అయితే ఈ నోటుపై ఆర్బీఐ ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇది కేవలం ఎడిట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఫ్యాక్ట్ చెక్ నిర్వహించే ఫ్యాక్ట్ లీ సైతం ఇది డిజిటల్‌గా ఎడిట్ చేసిన నోటు అని తేల్చింది. శిల్పి అరుణ్ యోగ్‌రాజ్ బాల రాముడి శిల్పాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ప్రజలంతా రామ నామ స్మరణలో మునిగి తేలుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో.. దేశం మొత్తం ఏదో ఒక రూపంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి వార్తలు వైరల్ కావడం అందరి దృష్టి ఆకర్షించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..