Video: వీల్‌ చైర్‌తో అదానీయన్‌ బంజీ జంప్‌! వీడియో షేర్ చేసిన గౌతమ్‌ అదానీ

|

Mar 27, 2025 | 12:39 PM

గౌతం అదానీ తన ఎక్స్ఖా తాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. అదానీ గ్రూప్ ఉద్యోగి కె. మెహతా వీల్‌చైర్‌తో బంజీ జంప్ చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. రిషికేశ్‌లో జరిగిన ఈ సాహసం అందరినీ ఆకట్టుకుంది. అదానీ, మెహతా ధైర్యాన్ని, విల్‌పవర్‌ను ప్రశంసిస్తూ, భయాలు అడ్డంకులు విజయాన్ని ఆపలేవని తెలిపారు.

Video: వీల్‌ చైర్‌తో అదానీయన్‌ బంజీ జంప్‌! వీడియో షేర్ చేసిన గౌతమ్‌ అదానీ
Adani
Follow us on

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఓ ఆసక్తికర వీడియోను తన సోషల్‌ మీడియా ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. అందులో ఓ వ్యక్తి వీల్‌చైర్‌తో సహా బంజీ బంగీ జంప్ చేస్తున్నట్లు మనం చూడొచ్చు. ఈ అరుదైన ఫీట్‌ను ఆ వ్యక్తి రిషికేశ్‌లో చేశారు. కాగా, జంప్‌ చేసిన వ్యక్తి పేరు కే మెహతా. ఆయనను అదానీయన్‌గా గౌతమ్‌ అదానీ పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో పని చేసే ఉద్యోగిగా అర్థం చేసుకోవచ్చు. అయితే.. వీల్‌చైర్‌లో ఇలాంటి సాహసం చేయడంతో ఆయన ఒక బలమైన విషయాన్ని వెల్లడిస్తు్న్నారని ఎలాంటి భయాలు, అడ్డంకులు మీ విల్‌పవర్‌ను ఆపలేవంటూ అదానీ అన్నారు. కే మెహతా కేవలం అందరిలో స్ఫూర్తి నింపడమే కాకుండా.. అదానీయన్‌ అంటే చూపించారు అంటూ ఆయనను ప్రశంసించారు. హమ్‌ కర్‌కే దిఖాతే హై అనే నినాదాన్ని ఆయన పోస్ట్‌కు జోడించారు.