Actor Mohanlal: ఏప్రిల్ 6 నుంచి కేరళలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభంకానున్న నేపథ్యంలో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా పేరు తెచ్చుకున్న ప్రముఖ ఇంజనీర్ ఈ.శ్రీధరన్ కూడా కేరళ ఎన్నికల్లో పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. పాలక్కాడ్ నియోజక వర్గం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న శ్రీధరన్ తన గెలుపు ఖాయమని ధీమాగా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. శ్రీధరన్‌కు తన మద్ధతును తెలిపారు. శ్రీధరన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన మోహన్‌లాల్ ఓ వీడియో మెసేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీధరన్ సాధించిన ఘనతలను గుర్తుచేసుకున్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో శ్రీధరన్ సేవలు భవిష్యత్తులోనూ అవసరమని చెప్పుకొచ్చారు. ఇక మోహన్ లాల్ ఈ సందర్భంగా పాంబన్ వంతెనను శ్రీధరన్ కేవలం 46 రోజుల్లోనే నిర్మించారని, అతని విల్ పవర్‌కు అదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఢిల్లీ, కొచ్చిలాంటి పట్టణాల్లో మెట్రో రూపకల్పనలో శ్రీధరన్‌ది ముఖ్యపాత్ర అని కొనియాడారు. ప్రపంచమంతా అసాధ్యమనుకున్న కొంకన్ రైల్వే బ్రిడ్జిని శ్రీధరన్ సాకారం చేశారని చెప్పుకొచ్చారు. దేశాన్ని కొత్త మార్గంలో తీసుకెళ్లడానికి మనకు శ్రీధరన్ సేవలు అవసరం అని చెప్పిన మోహన్ లాల్.. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మోహన్ లాల్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన శ్రీధరన్.. తనకు శుభాకాంక్షలు చెప్పినందుకు మోహన్‌లాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినీ రంగానికి మోహన్‌లాల్ చేస్తోన్న కృషి ఎనలేనిదని వ్యాఖ్యానించారు. మనమంతా కలిసి కొత్త కేరళను నిర్మిద్దామని శ్రీధరన్ తన ట్వీట్‌లో పేర్కొ్న్నారు.
Thank you @Mohanlal for the kind gesture and good wishes. Your contribution to the film is highly commendable. Together we can build a new Kerala. #KeralaWithModi
#PuthiyaKeralam pic.twitter.com/4004KYPjXo— Metroman E Sreedharan (@TheMetromanS) April 2, 2021
Also Read: Delhi Lockdown News: కోవిడ్ ఉధృతి…దేశ రాజధానిలో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చేసిన సీఎం కేజ్రీవాల్
రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. మీ కార్డ్‌పై వచ్చే ఆహార పదార్థాల సమాచారం ఇలా తెలుసుకోండి..