దేశంలో త్వరలో కోవిడ్ వ్యాక్సీన్, కార్యాచరణ ప్రణాళిక రెడీ

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..రానున్న సంవత్సరంలో 400 నుంచి 500 మిలియన్ డోసుల వ్యాక్సీన్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ టీకా మందుల గురించి కేంద్ర మంత్రి హర్షవర్దన్ అధ్యక్షతన బుధవారం ఓ సమావేశం జరిగింది. వ్యాక్సీన్ ఇచ్చేందుకు ఎంతమంది వలంటీర్లను ఎంపిక చేయాలి, ఇది ఎలా జరగాలి తదితర అంశాల గురించి రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఈ మీటింగ్ లో చర్చించారు. రేపో మాపో దీన్ని ఖరారు చేయవచ్ఛునని […]

దేశంలో త్వరలో కోవిడ్ వ్యాక్సీన్, కార్యాచరణ ప్రణాళిక రెడీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 14, 2020 | 5:16 PM

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..రానున్న సంవత్సరంలో 400 నుంచి 500 మిలియన్ డోసుల వ్యాక్సీన్ అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ టీకా మందుల గురించి కేంద్ర మంత్రి హర్షవర్దన్ అధ్యక్షతన బుధవారం ఓ సమావేశం జరిగింది. వ్యాక్సీన్ ఇచ్చేందుకు ఎంతమంది వలంటీర్లను ఎంపిక చేయాలి, ఇది ఎలా జరగాలి తదితర అంశాల గురించి రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళిక గురించి ఈ మీటింగ్ లో చర్చించారు. రేపో మాపో దీన్ని ఖరారు చేయవచ్ఛునని తెలుస్తోంది. కేంద్ర డిసీజ్ కంట్రోల్ తో బాటు అమెరికాలోని ఈ విభాగం అనుసరిస్తున్న వ్యూహాలను కూడా ఇందులో సమీక్షించారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ వికె.పాల్ తదితర నిపుణులతో కూడిన బృందం యుధ్ధ ప్రాతిపదికన యాక్షన్ ప్లాన్ పై దృష్టి పెట్టింది.