కోతి వేషాలంటే ఇవే.. లాక్‌డౌన్‌లో ఏటీఎంలోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..!

| Edited By:

May 06, 2020 | 9:29 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అతి తక్కువ ఏటీఎంలలో క్యాష్ ఉండటమే కాకుండా.. రద్దీ లేని ప్రదేశాల్లోని ఏటీఎం సెంటర్లలో పెద్దగా సెక్యూరిటీ కూడా  ఉండటం లేదు. ఇందుకు కారణం ఎక్కడైతే జనావాసాలు తక్కువగా ఉండారో అక్కడి మిషిన్లలో క్యాష్ పెట్టడం తగ్గించారు. అయితే ఇదే అదనుగా ఓ కోతి.. ఢిల్లీలోని సౌత్‌ ఏవెన్యూలోని ఓ  ఏటీంఎం సెంటర్‌లోకి వెళ్లి నానా హంగామా చేసింది. అందులో ఉన్న పోస్టర్లను చింపేయడమే కాకుండా.. ఏటీఎం […]

కోతి వేషాలంటే ఇవే.. లాక్‌డౌన్‌లో ఏటీఎంలోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..!
Follow us on

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అతి తక్కువ ఏటీఎంలలో క్యాష్ ఉండటమే కాకుండా.. రద్దీ లేని ప్రదేశాల్లోని ఏటీఎం సెంటర్లలో పెద్దగా సెక్యూరిటీ కూడా  ఉండటం లేదు. ఇందుకు కారణం ఎక్కడైతే జనావాసాలు తక్కువగా ఉండారో అక్కడి మిషిన్లలో క్యాష్ పెట్టడం తగ్గించారు. అయితే ఇదే అదనుగా ఓ కోతి.. ఢిల్లీలోని సౌత్‌ ఏవెన్యూలోని ఓ  ఏటీంఎం సెంటర్‌లోకి వెళ్లి నానా హంగామా చేసింది. అందులో ఉన్న పోస్టర్లను చింపేయడమే కాకుండా.. ఏటీఎం మిషన్‌ను కూడా ధ్వంసం చేసింది. క్యాష్ ఒక్కటి ముట్టుకోలేదు కానీ..
ఏటీఎం ఉన్న రూంలో చేయాల్సినంత గాయి చేసింది ఆ కోతి. అయితే సడన్‌గా ఓ వ్యక్తి ఏటీంఎంలోకి ఎంటర్‌ అవ్వడంతోనే ఈ సీన్‌ చూసి ఆశ్చర్యపోయాడు. దీంతో వెంటనే పోలీసులకు  తెలియజేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. బ్యాంకు సిబ్బంది సహాయంతో అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో కోతి చేసిన కోతి చేష్టల్ని చూసి ఖంగు తిన్నారు. కోతి ఎంటీ  ఇలా చేయడమేంటని ముక్కున వేలేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.